ఆటాపోటీ

బిసిసిఐపై మనోహర్ అస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసిసిఐపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఐసిసి చైర్మన్ మనోహర్ సరైన సమయంలో, సరైన అస్త్రాన్ని సంధించాడు. మిగతా దేశాల సాయంతో చావుదెబ్బ కొట్టాడు. పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ఐసిసి ఆదాయం, వాటాల పంపిణీ అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఐసిసిలోని క్రికెట్ బోర్డులకు అందే మొత్తాల్లో భారీ వ్యత్యాసం ఉండకూడదని తీర్మానించారు. ఉత్తమ పాలన, అంతర్జాతీయ క్రికెట్‌పై ఐసిసి పట్టు ఎంత వరకు ఉండాలన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఉన్న అఫిలియేట్ సభ్యత్వాలను రద్దు చేయాలన్న ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని, సభత్వానికి ఉండాల్సిన అర్హతలను నిర్ణయించడానికి ఒక కమిటీని నియమించాలని, మండలిలో ఒక మహిళా డైరెక్టర్‌ను తీసుకోవాలని నిర్ణయించారు. గత నెల జరిగిన వర్కింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు వార్షిక సమావేశంలో ఆమోద ముద్ర పడడం లాంఛనమే. ఆ వెంటనే పలు కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. ఐసిసి రూపురేఖలు ఒక్కసారిగా మారిపోతాయి. ఈ మార్పుల సునామీతో అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.