ఆటాపోటీ

రాళ్ల యుద్ధం! (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అది యుద్ధ మైదానం కాకపోయినా, రాళ్లతో ఒకరినొకరు కొట్టుకుంటారు. జెల్లికట్టు మాదిరిగానే ఇది కూడా ఒక ఆటే. సంప్రదాయం పేరుతో జరుగుతున్న తతంగమే. సుమారు మూడు వందల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇది. మధ్యప్రదేశ్‌లోని చిన్‌ద్వారా జిల్లాలో జామ్ నదీ తీరంలోని పంధుర్నా, సవార్‌గావ్ గ్రామస్తులు పాల్గొనే ‘గోత్మర్ మేళా’ వాస్తవానికి యుద్ధాన్ని తలపిస్తుంది. వందలాది మంది తీవ్రంగా గాయపడతారు. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. జామ్ నది ఒడ్డున ఒక చెట్టు మానును పాతి, దానిపై జెండాను ఎగరేస్తారు. ఒక గ్రామానికి చెందిన సాహసవంతులు ఆ జెండాను తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరో గ్రామానికి చెందిన వారు పెద్దపెద్ద రాళ్లను విసురుతూ వారిని అడ్డుకుంటారు. రాళ్ల వర్షం నుంచి తప్పించుకుంటూ, గాయాలను లెక్కచేయకుండా జెండాను ఏ గ్రామస్తులు తెస్తారో ఆ గ్రామం గెలిచినట్టు ప్రకటిస్తారు. ఏటా వందల సంఖ్యలో ప్రజలు గాయపడుతున్నా, గోత్మర్ మేళాను నిషేధించాలన్న డిమాండ్‌ను ఇరు గ్రామాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయాన్ని అడ్డుకునే హక్కు ఎవరికి ఉందంటూ నిలదీస్తున్నారు. ప్రాణాలు పోయినాసరే సంప్రదాయాన్ని కొనసాగించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఈఏడాది సుమారు నాలుగు వందల మంది ఈ మేళాలో తీవ్రంగా గాయపడ్డారు. అయినాసరే వచ్చే ఏడాది మళ్లీ గోత్మర్ మేళాను నిర్వహిస్తామని రెండు గ్రామాలకు చెందిన పెద్దలు తేల్చి చెప్తున్నారు.

- సత్య