ఆటాపోటీ

తొమ్మిది జట్ల టెస్టు లీగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిది జట్లతో కూడిన టెస్టు లీగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. స్కాట్‌లాండ్, అఫ్గానిస్థాన్ దేశాల్లోని దేశవాళీ పోటీలకు ‘్ఫస్ట్‌క్లాస్’ హోదాను ప్రకటించడంతో, ఈ రెండు దేశాలకు టెస్టు హోదా దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం టెస్టు జట్లు పదికాగా, ఈ సంఖ్య త్వరలోనే పనె్నండుకు పెరుగుతుంది. తొమ్మిది జట్ల టెస్టు లీగ్ జరిగితే మిగతా మూడు జట్లకు, ప్రపంచ మేటి జట్లతో తలపడే అవకాశం లభిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీలకు ప్రపంచ ర్యాంకింగ్స్‌ను ప్రాతిపదికగా తీసుకుంటారు. కాగా, 2023 నుంచి ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్‌లో పాల్గొనే అర్హతను సంపాదించేందుకు 13 జట్ల మధ్య టోర్నీని ఐసిసి నిర్వహించనుంది. ఎక్కువ జట్లకు వరల్డ్ కప్‌లో చోటు కల్పించడమే ఈ ప్రతిపాదన లక్ష్యం. వివిధ దేశాల్లో జరిగే టి-20 టోర్నీలను ఈ ఫార్మాట్‌లో జరిగే ప్రపంచ కప్ పోటీలకు అర్హతా పోటీలుగా ఐసిసి గుర్తించనుంది.
పూర్తిస్థాయి హోదాపై దృష్టి
ఐసిసిలో పది బోర్డులకు పూర్తిస్థాయి హోదా ఉంది. మిగతా వాటికి అసోసియేట్ లేదా అఫ్లియేటెడ్ సభ్యత్వాలున్నాయి. ‘్ఫల్ మెంబర్స్’కు మాత్రమే టెస్టు హోదా ఉంది. దీనితో ప్రపంచంలోని మిగతా దేశాల్లో క్రికెట్ అభివృద్ధి కావడం లేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలంటే, ముందుగా పూర్తిస్థాయి హోదాను శాశ్వతంగా ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. మనోహర్ ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. జింబాబ్వే లాంటి జట్టుకు టెస్టు హోదా ఉంటే, మేటి జట్లను సైతం భయపెడుతున్న ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ వంటి జట్లను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నకు ఐసిసి సమాధానం వెతుక్కునే పనిలో పడింది. వెస్టిండీస్ కూడా చాలాకాలంగా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. అద్భుతంగా రాణిస్తున్న జట్లను కాదని, వైఫల్యాల బాటలో నడుస్తున్న జట్లను నెత్తిన ఎక్కించుకోవడం సబబు కాదని ర్యాంకింగ్స్‌ను బట్టి టెస్టు హోదాను ఎప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఉందని ఐసిసి తీర్మానించింది.