ఆటాపోటీ

అక్రం, వకార్ ట్వీట్ల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్లు వసీం అక్రం, వకార్ యూనిస్ మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతున్నది. దీనికి భారత మాజీ ఓపెనర్ సెవాగ్ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలే కారణం కావడం విశేషం. 1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుంబ్లే 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. 1956లో జిమ్ లేకర్ తర్వాత ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. కుంబ్లే ఈ ఫీట్‌ను ప్రదర్శించి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల పలువురు అతనిని అభినందిస్తూ సందేశాలు పంపారు. అక్రం తన సందేశంలో పలు అంశాలను ప్రస్తావించాడు. తాను కూడా ఆ చారిత్రక సంఘటనలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని అంటూ, కుంబ్లేకు 10 వికెట్లు లభించకుండా వకార్ ప్రయత్నించాడని పేర్కొన్నాడు. అతను ఉద్దేశపూర్వకంగా రనౌట్ కావాలని అనుకున్నాడని, అలాగైతే కుంబ్లేకు పది వికెట్లు పడగొట్టిన రికార్డు లభించదన్నదన్నదే అతని అభిప్రాయమని అన్నాడు. అయితే, 37 వ్యక్తిగత స్కోరువద్ద కుంబ్లే వేసిన బంతిని షాట్ కొట్టడంలో విఫలమైన అక్రం స్లిప్స్‌లో కాపుకాసిన వివిఎస్ లక్ష్మణ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. కుంబ్లేకు పది వికెట్లు లభించగా, వకార్ ఆరు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, అక్రం సందేశంలోని అంశాలను సెవాగ్ ప్రధానంగా ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. ‘కిస్మత్‌కే ఆగే ఆల్ సాజిష్ ఫెయిల్. వెల్‌డన్ వసీం భాయ్’ (అదృష్టం ముందు ఎలాంటి కుట్రలైనా విఫలమవుతాయి) అంటూ అక్రంను ఆకాశానికి ఎత్తాడు. కుంబ్లేకు రికార్డు అందకుంటూ వకార్ కుట్ర పన్నాడని పరోక్షంగా విమర్శించాడు. దీనిపై వకార్ తీవ్రంగా స్పందించాడు. అక్రం వయసు పెరుగుతున్నదని, అందుకే అతను లేనిపోని కథనాలను సృష్టించాడని ధ్వజమెత్తాడు. తాను అలాంటి ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశాడు. వకార్ వ్యాఖ్యలపై అక్రం కూడా అదే స్థాయిలో మండిపడ్డాడు. వయసు ఎవరికి పెరుగుతున్నదో స్పష్టంగా తెలిసిపోతున్నదని ట్వీట్ చేశాడు. తనను అవుట్ చేసే అవకాశాన్ని కుంబ్లేకు ఇవ్వబోనని వకార్ తనకు చెప్పాడని, ఇప్పుడు మాట మార్చాడని విరుచుకుపడ్డాడు. మొత్తం మీద అక్రం సందేశాన్ని ప్రస్తావిస్తూ సెవాగ్ చేసిన ట్వీట్లు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.