ఆటాపోటీ

చైనా నుంచి లండన్‌కు.. ( పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒలింపిక్స్‌ను చూసేందుకు చైనా నుంచి లండన్ వరకూ ప్రయాణించిన ఓ రైతు అప్పట్లో ‘రియల్ హీరో’గా మారాడు. జియాంగ్జూ ప్రాంతానికి చెందిన చెన్ గుయాన్మింగ్ ఓ సామాన్య రైతు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే, క్రీడా పతాకాన్ని స్వీకరించిన ఇంగ్లాండ్ ప్రధాని లండన్ ఒలింపిక్స్‌కు అందరూ ఆహ్వానితులేనని ప్రకటించాడు. ఆ ఆహ్వానాన్ని ఎంత మంది సీరియస్‌గా తీసుకున్నారో తెలీదుగానీ చెన్ మాత్రం లండన్ వెళ్లాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. కానీ, అంతదూరం వెళ్లడానికి అవసరమైన ఆర్థిక స్థోమత అతనికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లండన్ వెళ్లాలని అనుకున్న అతనికి రిక్షానే ప్రయాణ సాధనమైంది. 2010 మే 23న లండన్ యాత్రను ప్రారంభించిన చెన్ మొత్తం 16 దేశాల మీదుగా ప్రయాణించి లండన్ చేరాడు. సుమారు రెండేళ్లపాటు రిక్షాపై అష్టకష్టాలు పడి ఒలింపిక్ విలేజ్ చేరుకున్న అతనికి అథ్లెట్లు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు స్వదేశంలోనూ చెన్ సూపర్ హీరోగా వెలిగిపోతున్నాడు. అతని సాహసయాత్రను అంతా కథలుకథలుగా చెప్పుకొంటున్నారు.