ఆటాపోటీ

భువీ స్పెషల్! ( పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ తన రంజీ ట్రోఫీ కెరీర్ మొత్తంలో ఒకే ఒకసారి డకౌటయ్యాడు. అతనిని సున్నాకే అవుట్ చేసిన ఘనత భువనేశ్వర్ కుమార్ దక్కించుకున్నాడు. 2009 జనవరిలో ఉత్తర ప్రదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన రంజీ ఫైనల్‌లో ముంబయి 243 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ముంబయి మొదటి ఇన్నింగ్స్‌లో సచిన్ 15 బంతులు ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండానే భువీ బౌలింగ్‌లో శివకాంత్ శుక్లా క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ సచిన్ ఎప్పుడూ రంజీల్లో డకౌట్ కాలేదు. ఆ రికార్డు వికెట్ భువీకి ఒక ప్రత్యేక బహుమతిగా నిలిచిపోతుంది.