ఆటాపోటీ

వీరంతా ‘ఒక్కరే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్‌లో వందకుపైగా (136) టెస్టులు ఆడినప్పటికీ, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన ఏకైక ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్. హైదరాబాద్‌కు చెందిన ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ 86 వనే్డ ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. కానీ, అతనికి ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లభించలేదు. భారత సెలక్టర్లు తీసుకునే విచిత్ర నిర్ణయాలకు ఇదో నిదర్శనం. అటు ఇంగ్లాండ్, భారత క్రికెట్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక ఆటగాడు ఇఫ్తెకార్ అలీ ఖాన్ పటౌడ్ (సీనియర్ పటౌడీ). అతని కుమారుడు నవాబ్ ఆఫ్ పడౌటీ (జూనియర్) తర్వాతి కాలంలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
హ్యాండ్లింగ్ ది బాల్, అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఇప్పటి వరకూ అవుటైన ఏకైక ఆటగాడు మొహీందర్ అమర్‌నాథ్. ఈ విధంగా లక్ష్మణ్, పటౌడీ సీనియర్, మొహీందర్ తమతమ రంగాల్లో అరుదైన రికార్డులు సృష్టించారు.