ఆటాపోటీ

ఒలింపిక్స్‌లో కొత్త పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ పరిరక్షణతోపాటు, ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యర్ధాలను తిరిగి ఉపయోగించే అవకాశాలపై అవగాహన పెంచడానికి వీలుగా 2020 ఒలింపిక్స్‌లో పతకాలను ఆ వ్యర్ధాలతోనే తయారు చేయాలని నిర్వాహణ కమిటీ తీర్మానించింది. పాడైన సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ చేసి పతకాలు తయారు చేస్తామని తెలిపింది. అయితే, అన్ని పతకాలనూ ఇదే రీతిలో తయారు చేయాలా లేదా కొన్ని పతకాలకు మాత్రమే పరిమితం చేయాలా అన్న విషయాన్ని కమిటీ తన ప్రకటనలో స్పష్టంగా తెలుపలేదు. కానీ, పర్యావరణ పరిరక్షణకు టోక్యో ఒలింపిక్స్‌లో పెద్దపీట వేస్తామని, అందుకే ఎలక్ట్రానిక్స్ వ్యర్ధానలను రీసైక్లింగ్ చేస్తామని వివరించింది.