ఆటాపోటీ

గెలిచినా వెక్కిరించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో బ్రెజిల్ పోల్‌వాల్టర్ థియాగో బ్రాజ్ డ సిల్వ ఉత్సాహంగా బరిలోకి దిగాడు. ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఫైనల్ చేరాడు. అక్కడ కూడా అందరి కంటే ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అభిమానులు జేజేలు పలుకుతారనుకున్న అతను వారి వైఖరితో ఒక్కసారిగా నీరుగారిపోయాడు. ఫ్రెంచ్ పోల్‌వాల్టర్ రెనార్డ్ లావిలినీ ఫేవరిట్‌గా ముద్ర వేయించుకున్నప్పటికీ రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. స్టేడియంలోని ప్రేక్షకులు లావిలినీని పొడగ్తల్లో ముంచెత్తుతూ, అతనికి మద్దతు పలికారు. థియాగోను వెక్కిరించారు. చివరికి అతను పతకం స్వీకరిస్తున్నప్పుడు కూడా హేళన చేశారు. స్వర్ణ పతకం గెలిచి, దేశానికి పేరు తెచ్చినందుకైనా తనను గౌరవించాలని థియాగో నెత్తీనోరూ కొట్టుకొని ప్రాధేయపడినా ప్రేక్షకులు కనికరించలేదు.