ఆటాపోటీ

డైమండ్ డక్ హీరోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటైన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ, అసలు బంతిని ఆడకుండానే డకౌట్ కావడం చాలా అరుదు. దీనిని ‘డైమండ్ డక్’ అంటారు. క్రికెట్ చరిత్రలో తొలి ‘డైమండ్ డక్’ కెనడా ఆటగాడు హెన్రీ ఒసినే్డ పేరుమీద ఉంది. అలెక్స్ కూసక్ వేసిన వైడ్ బంతిని ఆడేందుకు క్రీజ్ నుంచి ముందుకు దూకుకెళ్లిన అతను షాట్ కొట్టలేక, వికెట్ కీపర్ స్టంప్ చేయడంతో అవుటయ్యాడు. ఆతర్వాత భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ జాబితాలో చేరాడు. అజంతా మెండిస్ (శ్రీలంక) వేసిన బంతి స్టంప్స్ నుంచి దూరంగా వెళుతుంటే, అంతకు ముందే భారీ షాట్‌కు సిద్ధమైన భువీ క్రీజ్ నుంచి బయటకు వచ్చాడు. క్రీజ్ నుంచి ముందుకొచ్చిన భువీ దానిని ఆడలేక విడిచిపెట్టాడు. కానీ, సకాలంలో క్రీజ్‌లోకి చేరుకోలేకపోవడంతో, వికెట్‌కీపర్ స్టంప్ చేయగా పెవిలియన్ చేరాడు. కాగా, డారెన్ బ్రోవో (వెస్టిండీస్) కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. 2015 ప్రపంచ కప్‌లో భాగంగా నెల్సన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రేవో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. క్రిస్ గేల్ బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా కొట్టి, సింగిల్‌కు ప్రయత్నించాడు. అతను అప్పటికే చాలా దూరం రావడంతో, నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న డారెన్ బ్రేవో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాడు. అయితే, అతను క్రీజ్‌లోకి చేరకముందే, బంతిని ఫీల్డ్ చేసిన ఐర్లాండ్ ఆఫ్ స్పిన్నర్ ఆండీ బ్రిన్ దానిని స్టంప్స్‌కు గురిచేసి విసిరాడు. అది నేరుగా వికెట్లను పడగొట్టడంతో డారెన్ బ్రేవో రనౌటయ్యాడు.