ఆటాపోటీ

2024కే మొగ్గు.. 2028 వద్దనే వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి పోటీదారులు తగ్గుతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి మల్లగుల్లాలు పడుతున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి)పై పారిస్ బాంబు పేల్చింది. 2024 ఒలింపిక్స్ హక్కుల కోసం బిడ్ వేశామని, ఒకవేళ దానిని కాదని, 2028 ఒలింపిక్స్‌ను ఇస్తామంటే ఎంతమాత్రం ఒప్పుకోబోమని తెగేసి చెప్పింది. 2024 బిడ్స్ నుంచి మిగతా దేశాలు వైదొలగ్గా, రేసులో లాస్ ఏంజిల్స్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్) మాత్రమే మిగిలాయి. సభ్య దేశాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఐఒసి అధ్యక్షుడు థామస్ బాచ్ ఇటీవలే ఒక ప్రతిపాదన చేశాడు. లాస్ ఏంజిల్స్, పారిస్ నగరాల్లో ఒక దానికి 2024 ఒలింపిక్స్ నిర్వాహణ హక్కులు లభిస్తే, రెండో నగరానికి 2028 ఒలింపిక్స్ అవకాశాన్ని కల్పిస్తామని అతను ప్రకటించాడు. అయితే, బాచ్ సూచనను పారిస్ తిరస్కరించింది. తాము 2024 ఒలింపిక్స్‌కు మాత్రమే బిడ్ వేశామని, ఆ రేసులోనే గెలుస్తామన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించింది. ఒకవేళ నిర్ణయం తమకు అనుకూలంగా రాకపోతే, రాజీపడబోమని, 2028లో ఒలింపిక్స్‌ను నిర్వహించాలన్న ఆలోచన లేదని పేర్కొంది. మొత్తం మీద వరుస షాకులతో ఐసిసి దిక్కుతోచని పరి స్థితిని ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు ఒలింపిక్స్ హక్కుల కోసం పోటీపడిన దేశాలే ఇప్పుడు జారుకోవడం మారుతున్న పరి స్థితులకు అద్దం పడుతున్నది. ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న వ్యయం వంటి అనేకానేక సమస్యలు చాలా దేశాలను ఒలిం పిక్స్ కోసం పరుగులు తీయకుండా అడ్డుకుంటున్నాయ.