ఆటాపోటీ

షాజాద్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ అంతర్యుద్ధం, బాంబు మోతలతో మారుమోగే అఫ్గానిస్థాన్‌లో క్రీడాకారులుగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ‘బుకాషి’ వంటి సాంప్రదాయ ఆటలకు తప్ప అఫ్గాన్‌లో మిగతా వాటికి ప్రాధాన్యం లేదు. క్రికెట్‌ను ఇస్లామిక్ మత విశ్వాసాలకు విరుద్ధంగా అక్కడ అభివర్ణిస్తారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ, అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన మహమ్మద్ షాజాద్ దూకుడును కొనసాగిస్తున్నాడు. టి-20 ఫార్మాట్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఐదో స్థానానికి నెట్టేసి, నాలుగో స్థానాన్ని ఆక్రమించడం అతని ప్రతిభకు నిదర్శనం. తన 58వ మ్యాచ్‌లో అతను 72 పరుగులు చేయడం ద్వారా, మొత్తం 1,779 పరుగులతో కోహ్లీని ఒక స్థానం కిందకు నెట్టేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా 1,709 పరుగులతో కోహ్లీ నాలుగో స్థానంలో ఉండగా, షాజాద్ అతని స్థానాన్ని ఆక్రమించాడు. భారత కెప్టెన్ చాలా తొందరగా షాజాద్‌ను వెనక్కునెట్టి, ముందుకు దూసుకెళ్లడం ఖాయం. అయితే, క్రికెట్‌కు ఏమాత్రం ఆదరణ, ప్రోత్సాహం లేని దేశం నుంచి షాజాద్ ఈ ఫీట్‌ను సాధించడాన్ని గొప్ప విషయం గానే చెప్పుకోవాలి. బ్రెండన్ మెక్‌కరమ్ (2,140 పరుగులు), తిలకరత్నే దిల్షాన్ (1,889), మార్టిన్ గుప్టిల్ (1,806) మాత్రమే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో షాజాద్ కంటే ముందున్నారు.