ఆటాపోటీ

ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా జట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చగడ్డివేస్తే భగ్గున మండే ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య క్రీడా వారధి ఏర్పడనుందా? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవుననే అనిపిస్తున్నది. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఎఫ్‌సి) ఆధ్వర్యంలో ఆసియా కప్ మహిళా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్తర కొరియాలో జరగనున్నాయి. సోమవారం నుంచి టోర్నీ ఆరంభం కానుండగా, షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉత్తర, దక్షిణ కొరియాలు తలపడాల్సి ఉంది. సహజంగా ఉత్తర కొరియాలో క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు భయపడుతున్న దక్షిణ కొరియా ఈసారి మనసు మార్చుకున్నట్టు సమాచారం. మహిళా సాకర్ జట్టును ఉత్తర కొరియాకు పంపాలని తీర్మానించిందని అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే, త్వరలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు మెరుగపడే అవకాశం ఉంది.