ఆటాపోటీ

షమీకి ఫిట్నెస్ సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత భారత పేసర్లలో మహమ్మద్ షమీని అందరి కంటే సమర్థుడిగా పేర్కోవాలి. స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై కూడా బంతిని స్వింగ్ చేయించగల సమర్థుడు అతను. వికెట్లకు ఇరువైపులా, గాల్లో నాట్యమాడుతున్న రీతిలో దూసుకొచ్చే షమీ బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడని బ్యాట్స్‌మన్ ఉండడు. కానీ, ఫిట్నెస్ సమస్య తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో షమీకి అనుకున్న స్థాయిలో పేరుప్రఖ్యాతులు రాలేదు. అతను ఈ హోం సీజన్‌లో 18 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. గాయాల నుంచి ఎంత త్వరగా కోలుకుంటే, అతని కెరీర్ అంత తొందరగా ఒక గాడిన పడుతుంది. లేకపోతే, చాలా మంది పేస్ బౌలర్ల మాదిరిగానే షమీ కెరీర్ కూడా ప్రమాదాల ఊబిలో చిక్కుకుపోతుంది.