ఆటాపోటీ

ధోనీని వేధిస్తున్న స్పైడర్‌క్యామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని మరింత
ఆసక్తికరంగా మార్చేందుకు వినియోగిస్తున్న స్పైడర్ క్యామ్‌లు భారత పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీని వేధిస్తున్నాయి. వీటి వల్ల క్రికెట్‌కు మంచికంటే నష్టమే ఎక్కువ వాటిల్లుతోందని ధోనీ అంటున్నాడు. చివరిదైన ఐదో వనే్డలో 331 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జాన్ హాస్టింగ్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన బంతి నేరుగా స్పైడర్‌క్యామ్‌కు తగిలింది. లేకపోతే అది ఖచ్చితంగా బౌండరీ దాటేది. అయితే, అంపైర్లు భారత్‌కు నాలుగు పరుగులు ఇవ్వకుండా, బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించారు. ఈ విషయాన్ని ధోనీ ప్రస్తావిస్తూ మూడు వందలకుపైబడి పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగినప్పుడు ప్రతి పరుగు చాలా కీలకమని వ్యాఖ్యానించాడు. తాను సంప్రదాయవాదినని అంటూ, ఆటగాళ్లకుగానీ, ఆటకుగానీ అడ్డురాకుండా స్పైడర్‌క్యామ్‌లు పని చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నాడు. బంతిని ఆడ్డుకుంటే వివిధ రకాలుగా పెనాల్టీలు వేస్తారని, అదే సూత్రాన్ని స్పైడర్‌క్యామ్‌కూ వర్తింప చేయాలని అన్నాడు. ‘బంతి స్పైడర్‌క్యామ్‌కు తగిలిన ప్రతిసారీ బ్యాట్స్‌మన్‌కు 2,000 డాలర్లు ఇస్తే బాగుంటుంది కదా’ అని చమత్కరించాడు. సాంకేతిక పరిజ్ఞానం క్రీడకు ఇబ్బందులు సృష్టించకూడదని అన్నాడు.