ఆటాపోటీ

ఫామ్‌లోకి గేల్ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పదో ఐపిఎల్ ఆరంభానికి ముందు అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో ఐదు మ్యాచ్‌లు ఆడి 109 పరుగులతో సరిపుచ్చాడు. ఆ తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో తొమ్మిది ఇన్నింగ్స్ ఆడాడు. 160 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం ఐపిఎల్‌కు వచ్చి, ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. దీనితో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనిని ఒక మ్యాచ్ నుంచి తప్పించాడు. అయితే, రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ విజృంభించాడు. 38 బంతులు ఎదుర్కొన్న అతను ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 77 పరుగులు చేసి, బెంగళూరు 21 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతను తనదైన శైలిలో ఆడడం అభిమానులకు ఊరటనిచ్చింది.

- సత్య