ఆటాపోటీ

నిబంధనలు గాలికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపిఎల్‌లో అంపైర్లకు క్రికెట్ నిబంధనలు పట్టవా? క్రికెట్ వౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారా? ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య ముంబయిలో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న సంఘటన ఐపిఎల్‌లో అంపైర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఒక ఓవర్ చివరి బంతిలో సింగిల్ లేదా మూడు పరుగులు సాధిస్తే తప్ప, మిగతా సందర్భాల్లో ఆ బంతిని ఆడిన బ్యాట్స్‌మన్‌కు తర్వాతి ఓవర్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే అవకాశం దక్కదు. కానీ, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక ఓవర్ చివరి బంతిలో సిక్స్ కొట్టాడు. అయితే, తర్వాతి ఓవర్‌లోనూ అతను స్ట్రయికింగ్‌కు దిగాడు. ఈ పొరపాటును అటు అంపైర్లుగానీ, ఇటు టోర్నీ నిర్వాహకులుగానీ గమనించలేదు. ఐపిఎల్ వంటి క్రికెట్ టోర్నమెంట్స్‌లో ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ వ్యాపార వస్తువుగా మారిపోతున్నదని, నియమ నిబంధనలను ఎవరూ ఖాతరు చేయరని చాలాకాలంగా వినిపిస్తున్న విమర్శలకు ఈ సంఘటన బలాన్నిస్తున్నది.