ఆటాపోటీ

డిఆర్‌ఎస్‌కు దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫీల్డ్ అంపైర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని అనుమానిస్తే, దానిపై అప్పీల్ చేసే ‘అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టం’ (డిఆర్‌ఎస్) అంటే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పెద్దలకు చిన్నచూపే. చాలాకాలం డిఆర్‌ఎస్‌ను అమలు చేసేందుకు నిరాకరిస్తూ వచ్చిన బిసిసిఐ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మొదటిసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ఐపిఎల్‌లో మాత్రం డిఆర్‌ఎస్‌ను దూరంగానే ఉంచింది. అయితే, అంపైర్లు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నారని పలు సందర్భాల్లో రుజువు కావడంతో బిసిసిఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకసారి, బ్యాట్స్‌మన్ జొస్ బట్లర్ రెండుసార్లు అంపైర్ల పొరపాటు నిర్ణయాల కారణంగా పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది. మరికొంత మందికి అంపైర్ల తీర్పు లాభించింది. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో కార్లొస్ బ్రాత్‌వెయిట్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రాబిన్ ఉతప్ప వికెట్లకు అడ్డంగా దొరికిపోయారు. కానీ, ఈ మూడు సందర్భాల్లోనూ బౌలర్లు చేసిన అప్పీల్స్‌ను అంపైర్లు పట్టించుకోలేదు. రిప్లేలో అంపైర్లు చేసిన పొరపాట్లు బహిర్గతమయ్యాయి. డిఆర్‌ఎస్ అంటే బిసిసిఐ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని కొంత మంది క్రికెటర్లే వ్యాఖ్యానించడం విశేషం.