ఆటాపోటీ

అడుగడుగునా అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసిసిఐకి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం సమస్యలకు బోర్డు స్వయంకృతమే ప్రధాన కారణం. ఐసిసి సమావేశాలు లేదా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ సదస్సులకు బోర్డు ప్రతినిధులుగా ఎవరిని పంపాలనే విషయంలో బిసిసిఐ మరోసారి పొరపాటు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా కొంతకాలం బిసిసిఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాల్సి వచ్చిన శ్రీనివాసన్ ఆ తర్వాత భారత క్రికెట్‌లో ద్వంద్వ ప్రయోజనాలు ఉన్నాయన్న కారణంగా, అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతని హయాంలోనే చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఎన్నో వివాదాలకు, విమర్శలకు, ఆరోపణలకు కారకుడైన శ్రీనివాసన్‌ను ఐసిసి సమావేశాలకు పంపాలని బోర్డు నిర్ణయించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సిఒఎ జోక్యం చేసుకోవడంతో, ఈ అంశం కూడా సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లింది. ఐపిఎల్‌లో ఒక ఫ్రాంచైజీ యజమానిగా ఉన్న శ్రీనివాసన్ నేరుగా బిసిసిఐలో ఎలాంటి పదవులను నిర్వహించడానికి వీల్లేదని న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలో, న్యాయమూర్తులు ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బిసిసిఐకి ప్రాతినిథ్యం వహించే అవకాశాల్ని విక్రం లిమాయే (సిఒఎ సభ్యుడు), అమితాబ్ చౌదరి (బిసిసిఐ సంయుక్త కార్యదర్శి), అనిరుద్ధ్ చౌదరి (గౌరవ కోశాధికారి)కి అప్పగించింది. సుప్రీం కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా, ఎన్ని పర్యాయాలు హెచ్చరించినా పద్ధతి మార్చుకోని బిసిసిఐ మరోసారి తన మొండి వైఖరితో పరువు పోగొట్టుకుంది. ‘బిగ్ త్రి’ దేశాలకు ఐసిసిలో ఉన్న భారీ వాటాను తగ్గించే ప్రతిపాదనను బిసిసిఐ వ్యతిరేకించింది. టెస్టు హోదా ఉన్న పది దేశాల్లో ఎనిమిది దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేస్తే, భారత్‌తోపాటు శ్రీలంక మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశాయి. పాలనా పరమైన మార్పులకు సంబంధించిన ప్రతిపాదనను మిగతా ఎనిమిది దేశాలతోపాటు శ్రీలంక కూడా స్వాగతించింది. కేవలం బిసిసిఐ మాత్రమే వ్యతిరేకతను వ్యక్తం చేసి పరువుతీసుకుంది.
స్పాట్ ఫిక్సింగ్ కేసు తెరపైకి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఉంటే బిసిసిఐ పరిస్థితి మరోలా ఉండేది. కానీ, అప్పట్లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించిన శ్రీనివాసన్‌కు ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉండడం, దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా అతని అల్లుడు గురునాథ్ మెయప్పన్ అధికారం చెలాయించడం, పందాలు కాయడంతో అతని పేరు కూడా వినిపించడం వంటి కారణాలతో బిసిసిఐ నోరు మెదపలేకపోయింది. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నది. తన దుందుడుకు చేష్టలతో బీహార్ క్రికెట్ సంఘాన్ని రద్దు చేసింది. ఆ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ కోర్టుకు ఎక్కడంతో, స్పాట్ ఫిక్సింగ్ అంశంతోపాటు, శ్రీనివాసన్ వంటి వారికి బిసిసిఐలో ఉన్న ద్వంద్వ ప్రయోజనాల అంశం కూడా బట్టబయలైంది. బోర్డు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్న విషయాన్ని గమనించిన సుప్రీం కోర్టు దేశంలో క్రికెట్ ప్రక్షాళకు శ్రీకారం చుట్టింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు విడతల్లో ఇచ్చిన నివేదికల ఆధారంగా, ఐపిఎల్ దోషులను ఖరారు చేసింది. అయితే, వారికి శిక్షను ఖాయం చేయడంతోపాటు భారత్‌లో క్రికెట్‌ను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు జస్టిస్ లోధా కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి, అందులోని అంశాలను తు.చ తప్పకుండా అమలు చేయాలని బిసిసిఐని ఆదేశించింది.
కానీ, సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసిన బిసిసిఐ అధికారులు వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారు. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత అనేక మలుపులు తిరిగిన కేసు చివరికి బిసిసిఐ మెడకు చుట్టుకుంది. లోధా సిఫార్సుల అమలు బాధ్యతను పాలనాధికారుల కమిటీ (సిఒఎ)కి సుప్రీం కోర్టు అప్పగించింది. అప్పటి నుంచి చోటు చేసుకుంటున్న అనేకానేక పరిణామాలు బిసిసిఐ ప్రతిష్ఠను దిగజారుస్తునే ఉన్నాయి. ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోకపోతే, భవిష్యత్తులో బిసిసిఐ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే ప్రమాదం కుంది