ఆటాపోటీ

వృద్ధనేతలే ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసిసిఐని ప్రత్యక్షంగానో, పరోక్షంగా శాసిస్తున్న వారిలో వృద్ధనేతలే ఎక్కువ మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల్లోనూ వీరే దర్శనమిస్తారు. మంత్రులు ఎవరూ బిసిసిఐ పాలక మండలిలో సభ్యులుగా ఉండరాదని లోధా కమిటీ సూచించింది. బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర పోస్టులకు ఎన్నికయ్యే వ్యక్తులకు కొన్ని స్పష్టమైన అర్హతలు ఉండాలని పేర్కొంది. అంతేగాక, వారి వయసు 70 సంవత్సరాలకు దాటరాదని, దివాలాదారుడై ఉండకూడదని, మంత్రిగా లేదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనే అమల్లోకి వస్తే ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) అధ్యక్షుడు శరద్ పవార్, తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) అధ్యక్షుడు శ్రీనివాసన్, సౌరాష్ట్ర క్రికెట్ చీఫ్ నిరంజన్ షా, పంజాబ్ క్రికెట్ బాస్‌లు ఎంపి పాండోవ్, ఐఎస్ బింద్రా వంటి ఎంతో మంది ఇంటిదారి పట్టక తప్పదు. వీరంతా ఏడు పదుల వయసు దాటినవారే.