పర్యాటకం

ముక్తిని ప్రసాదించే ముక్కంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క ర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకాలో మురుగుమళ్ళ. మురుగుమలైగా పేర్గాంచిన క్షేత్రంలో ముక్కంటి కోరి కొలువైనాడు. ఈ క్షేత్రానే్న శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయం అని అంటారు. బోళాశంకరుడైన ఈ ఈశ్వరుడు తన్ను దర్శించినంత మాత్రానే మోక్షాన్ని ఇచ్చే మహాశివుడుగా విఖ్యాతి గాంచాడు. అందుకే భక్తులంతా ఈ శివుడిని ముక్తిదాతగా ముక్తీశ్వర స్వామిగా పిలుస్తుంటారు.
ముక్తీశ్వర స్వామి ఆలయమున్న కొండను మురుగుమలై అని పిలుస్తారు. అలాగే ఈ క్షేత్రాన్ని మురుగుమళ్ళ అని పిలుస్తారు. మురుగుమలై క్షేత్రాన్ని చలమలకోట అని కూడా అంటారు. యుగాల తరబడి కొన్ని నీటి చలములు ఈ ప్రాంతంలో ఉండడంవల్ల ఈ ప్రాంతాన్ని చలమలకోట అని పేరు వచ్చిందంటారు.
ఒకప్పుడీ దివ్య క్షేత్రం దండకారణ్య ప్రాంతం. సప్తరుషులు సంచరించిన పుణ్యస్థలం. ఆ కాలంలో భరద్వాజ మహర్షి ఇక్కడ నివసించాడని ఈ శివుని సేవచేసుకునేవాడని అంటారు.
ఒకసారి తన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకోవడానికి అర్జునుడు ఇక్కడ ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుచెప్తారు. కాల క్రమంలో ఈ శివలింగం ఉన్న ఆలయం శిథిలమైపోగా ఈశ్వరుని ఆదేశంమేరకు మరలా అశ్వతయ్య అనే భక్తుడు అభివృద్ధి చేసినట్లు, రామతిన్నడు అనే పశువుల కాపరిని ఇక్కడే సప్తరుషులు అనుగ్రహించారని ఇక్కడి స్థల పురాణాల చెబుతుంది.
ఈ క్షేత్రపరిసరాలన్నీ అద్భుత అందాలకు వేదిక గా ఉంటాయ. ఈ ముక్తీశ్వర స్వామి ఆలయంలో అడుగడుగూ ప్రశాంతతో పాటు ప్రకృతి అందాలు పరచుకున్న ఈ దివ్యాలయం శోభవర్ణించడానికి మాటలు చాలవు.
చారిత్రికాధారాల వల్ల శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి సుమారు వెయ్యి సంవత్సరాలు అయనట్టు తెలుస్తుంది.
య శోభ వర్ణనాతీతం. ఆలయ ప్రాకారాలమీద అందమైన దేవతా శిల్పాలలో జీవకళఉట్టి పడుతుంటుంది. ప్రధానాలయంలో స్వామి వారి గర్భాలయానికి ఎదురుగా రెండు నందులున్నాయి. వాటిలో ఒకటి నందీశ్వరుడు , రెండోది భృంగీశ్వరుడు. ప్రధానాలయంలో స్వామివారి గర్భాలయానికి ఎడమ వైపు భాగంలో వినాయకుడు, కుడివైపున పార్వతి మాత కొలువుదీరారు.
పురాణ గాథ
భరద్వాజ మహర్షి ప్రతిరోజూ కాశీకి వెళ్లి శివుణ్ణి దర్శించుకునేవాడు. అయితే కొంతకాలానికి అతని తల్లిదండ్రులు వృద్ధాప్యంతో ఉండడంతో వారిని విడిచి కాశీకి వెళ్ళలేక శివపూజను మానలేక మానసిక క్షోభను పొందేవాడు. ఆ సమయంలోనే ఇక్కడే ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని తన తపస్సుతో మెప్పించి గంగమ్మను ఇక్కడికి రప్పించాడట. తాను రోజూ గంగలో స్నానం చేసి గంగాజలంతో శివుని అభిషేకించి మనశ్శాంతిని పొందేవాడు భరద్వాజ మహర్షి. ఆ తరువాత ఎంతోమంది మునులు, రుషులు ఇక్కడ స్వామిని పూజించి తరించారు.
గర్భాలయంలో నల్లని రాతి శిలలో మలచబడిన ముక్తీశ్వర లింగం దర్శనం మాత్రం చేతనే పంచమహాపాతకాలు సైతం మటుమాయమవుతాయంటారు.
సాక్షాత్తు భరద్వాజ మహర్షి అభీష్టం మేరకు స్వామి ఇక్కడకు వచ్చాడుకనుకనే ఈ క్షేత్రాన్ని భరద్వాజ క్షేత్రంగా పిలుస్తారు.
ఇదే ఆలయ ప్రాంగణంలో మరోప్రక్క శ్రీ వల్లీ దేవ సుబ్రహ్మణ్యస్వామివారు కొలువుదీరారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం సర్వ మంగళకరం.
ఈ దివ్యాలయ ప్రాంగణంలో ముక్తీశ్వర స్వామి వారిని తన తపోశక్తితో ప్రసన్నం చేసుకున్న మునిపుంగవుడు భరద్వాజ మహర్షి. అనే కారణంగా శ్రీ భరద్వాజ మహర్షి మందిరం నిర్మించి ఈ మహర్షిని ఆరాధిస్తారు.
ఈ మందిరానికి సమీపంలో నవగ్రహ మందిరం కూడా ఉంది. గ్రహ దోషాలతో బాధపడేవారు తమ దోష పరిహారార్థం ఆయా పూజలు చేయించుకుంటారు.
ఇదే ప్రాంగణంలో ఒక ప్రక్క నాగదేవతల మూర్తులు కూడా ఉన్నాయి. సంతానం లేనివారు, సత్‌సంతానం కోసం పరితపించేవారు ఈ నాగదేవతలకు పూజలు, అభిషేకాలు చేస్తే ఫలితం ఉంటుందని నమ్ముతారు.
ఈ ఆలయ సమీపంలో కొండకు కొంచెం కింది భాగంలో పురాతన కాలంనాటి కోనేరు ఉంది. దీనిని చెలమ లేదా నీటి గుండంగా చెబుతారు. భరద్వాజ మహర్షి తన తపశ్శక్తితో తెప్పించిన గంగమాతే ఈ నీరుఅని ఇక్కడి వారు చెబుతారు. ఈ నీటి కుండంలోని జలం అత్యంత మహిమాన్వితమైనది. స్వచ్ఛమైనది. సర్వరోగ నివారిణి. రోగులు ఈ ఈ శుద్ధ, ఔషధయుక్తమైన జలాన్ని సేవిస్తే రోగాలు దూరమవుతాయని అంటారు.
నీటి కుండానికి సమీపంలో విఘ్నేశ్వరుని మందిరం ఉంది. ఈ మందిరంలోని వినాయకుని నీటి కుండంలోని శుద్ధ జలాలలతో అభిషేకిస్తే సర్వశుభాలు కలుగుతాయంటారు. ఇక్కడే సప్త్తమాతృకల పురాతన మందిరం ఉంది. శివరాత్రి రోజే కాక ప్రతిరోజు ఇక్కడ స్వామివారికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు.
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అతి పురాతన శైవ క్షేత్రమైన ఈముక్తీశ్వర ఆలయాన్ని చేరుకోవడానికి చింతామణి వరకు వచ్చి అక్కడనుంచి ఏదైనా వాహనంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ శ్రీ ముక్తీశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

- గున్న కృష్ణమూర్తి