ఆటాపోటీ

తిరుగులేని స్ట్ఫె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల టెన్నిస్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ క్రీడాకారిణుల జాబితాలో స్ట్ఫె గ్రాఫ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌తోపాటు, ఒలింపిక్స్ పతకాన్ని కూడా గెల్చుకోవడాన్ని ‘గోల్డెన్ శ్లామ్’ అంటారు. టెన్నిస్ చరిత్రలోనే ఈ ఘతనను దక్కించుకున్న ఏకైక ప్లేయర్ స్ట్ఫె గ్రాఫ్. 1988లో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, వింబుల్డన్‌తోపాటు ఒలింపిక్స్‌లోనూ టైటిళ్లు సాధించింది. కాగా, ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను చాలా మందే సాధించారు. అయితే, రెండు పర్యాయాలు ఈ ఫీట్‌ను అందుకున్న తొలి ఆటగాడు రాడ్ లీవర్. 1962లో తిరిగి 1969లో అతను నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌ను కైవసం చేసుకున్నాడు.
సమానావకాశం: అమెచ్యూర్స్, ప్రొఫెషనల్స్‌కు సమాన అవకాశాలిచ్చిన తొలి గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్. 1968లో ఓపెన్ టోర్నీగా మార్చిన నిర్వాహకులు అమెచ్యూర్స్‌కు కూడా ప్రొఫెషనల్స్‌తో కలిసి పోటీపడే అవకాశాన్ని కల్పించారు.
యానిక్ నోవా రికార్డు: ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ క్రీడాకారుడిగా యానిక్ నోవా రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో ఈ ఘనత అథ్లియా గిబ్సన్‌కు దక్కుతుంది. 1956లో ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించింది. వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ కూడా ఆమే కావడం విశేషం.