ఆటాపోటీ

ఎన్నో మార్పులు.. చేర్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెంచ్ ఓపెన్ ఎన్నో మార్పులకు లోనైంది. మరెన్నో మలుపులు తిరిగింది. వివిధ దశల్లో పలురకాల కోర్టులపై ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. మొదట్లో గ్రాస్ కోర్టులపై మ్యాచ్‌లను నిర్వహించేవారు. 1928లో కొత్త స్టేడియాన్ని నిర్మించినప్పుడు, తొలిసారి రెడ్ క్లేని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో అమెరికాతో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్‌లకు మరో కోర్టు అందుబాటులో లేకపోవడంతో, ప్రత్యేకంగా స్టేడియాన్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తం మీద, అన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత చివరికి దీనిని క్లే కోర్టు టోర్నమెంట్‌గా స్థిరీకరించారు. ఒక రకంగా చెప్పాలంటే, రోలాండ్ గారోస్‌లో మాదిరి మరే ఇతర టోర్నీల్లో ప్రయోగాలు జరగలేదు. అందుకే మిగతా గ్రాండ్ శ్లామ్స్ వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌తో పోలిస్తే ఫ్రెంచ్ ఓపెన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
ఒకప్పుడు చిన్న వేదిక
మిగతా గ్రాండ్ శ్లామ్స్ వేదికలతో పోలిస్తే, పారిస్‌లోని రోలాండ్ గారోస్ ఎరినా ఒకప్పుడు సగం కూడా ఉండేది కాదు. దీనిని అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ భారీ ప్రణాళికలను అమలు చేసింది. మొత్తానికి 2016 నాటికి ఫ్రెంచ్ ఓపెన్‌కు కూడా భారీ వేదిక సిద్ధమైంది.
క్లే కోర్టుల ఆవిర్భావానికి కూడా ఒక చరిత్ర ఉంది. 19వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ టెన్నిస్ చాంపియన్లు విలియమ్ రెన్‌షా, ఎర్నెస్ట్ రెన్‌షా కలిసి కానెస్‌లో గ్రాస్ కోర్టును అభివృద్ధి చేసే ప్రయత్నంలో పడ్డారు. కానీ, మధ్యదరా సముద్ర ప్రాంతం కావడంతో అక్కడ పచ్చిక ఎదగలేదు. నాటిన కొన్నాళ్లకే పచ్చిక ఎండిపోయేది. దీనితో విసిగిపోయిన రెన్‌షా సోదరులు స్థానికంగా దొరికే సున్నంతోనే బేస్ వేసి, దానిపై ఇటుక పొడిని చల్లారు. ఈ ప్రయోగం ఫలించింది. కాలక్రమంలో సాంకేతికంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, అదే మూల సూత్రానే్న ఇప్పటికీ అనుసరిస్తున్నారు.
స్థానికులకు నిరాశే
స్థానికులకు అచ్చిరాని టోర్నమెంట్‌గా ఫ్రెంచ్ ఓపెన్‌ను పేర్కోవాలి. ఇప్పటి వరకూ ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు మాత్రమే టైటిళ్లను గెల్చుకోగలిగారు. 1983లో యానిక్ నోవా తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఫ్రెంచ్ వారెవరూ టైటిల్ సాధించలేదు. అదే విధంగా మహిళల విభాగంలో మేరీ పియర్స్ 2000లో టైటిల్ అందుకుంది.