ఆటాపోటీ

టీనేజ్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన టీనేజ్ సంచలనంగా మోనికా సెలెస్ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 1990లో టైటిల్ గెల్చుకునే సమయానికి ఆమె వయసు 16 సంవత్సరాల ఆరు నెలలు. కాగా, అరంటా సాంచెజ్ వికారియో (1989), స్ట్ఫె గ్రాఫ్ (1987) టైటిళ్లు అందుకునే సమయానికి వారి వయసు 18 సంవత్సరాలు కూడా నిండలేదు. పురుషుల విభాగంలో మైఖేల్ చాంగ్ పిన్నవయస్కుడు. 1989లో అతను పురుషుల సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాల మూడు నెలలు. 18 ఏళ్లలోపే టైటిల్ సాధించిన వారిలో మాట్స్ విలాండర్ (1982) కూడా ఉన్నాడు.