ఆటాపోటీ

ఈ ఫార్ములా సీజన్‌లో 21 రేస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సీజన్‌లో ఫార్ములా వన్ 21 రేస్‌లతో కొనసాగుతుంది. సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ 20 రేసులు ఉంటాయి. అయితే కొత్తగా అజర్‌బైజాన్ రాజధాని బకూ రేస్ ట్రాక్ ఈ జాబితాలో చేరింది. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్‌ఐఎ) ప్రకటించిన షెడ్యూల్‌ను అనుసరించి ఈ ఏడాది మార్చి 20న ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీతో మొదలయ్యే 2016 సీజన్ నవంబర్ 27న అబూదబీ రేస్‌తో ముగుస్తుంది. కొత్తగా తీసుకున్న నిర్ణయాలను అనుసరించి టైర్ సప్లయర్ పిరెల్లీ సంస్థ మూడు డ్రై వెదర్ కాంపౌండ్స్‌ను సరఫరా చేస్తుంది. ఇంతకు ముందు రెండు డ్రై వెదర్ కాంపౌండ్స్‌ను ఈ సంస్థ అందించేది.

షెడ్యూల్ ఇదే
మార్చి 20: ఆస్ట్రేలియా (మెల్బోర్న్), ఏప్రిల్ 3: బహ్రైన్ (బహ్రైన్), ఏప్రిల్ 17: చైనా (షాంఘై), మే 1: రష్యా (సోచి), మే 14: స్పెయిన్ (బార్సిలోనా), మే 29: మొనాకో (మాంటె కార్లో), జూన్ 12: కెనడా (మాంట్రియల్), జూన్ 19: అజర్‌బైజార్ (బకూ), జూలై 3: ఆస్ట్రియా (స్పీల్‌బెర్గ్), జూలై 10: యునైటెడ్ కింగ్‌డమ్ (సిల్వర్‌స్టోన్), జూలై 24: హంగెరీ (బుడాపెస్ట్), జూలై 31: జర్మనీ (హకెన్‌హెమ్), ఆగస్టు 28: బెల్జియం (స్పా-ఫ్రాంకోచాంప్స్), సెప్టెంబర్ 4: ఇటలీ (మోన్జా), సెప్టెంబర్ 18: సింగపూర్ (సింగపూర్), అక్టోబర్ 2: మలేసియా (సెపాంగ్), అక్టోబర్ 9: జపాన్ (సుజుకా), అక్టోబర్ 23: అమెరికా (ఆస్టిన్), అక్టోబర్ 30: మెక్సికో (మెక్సికో సిటీ), నవంబర్ 13: బ్రెజిల్ (సావోపౌలో), నవంబర్ 27: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (అబూదబీ).