ఆటాపోటీ

పిచ్చి చేష్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొస్సేన్ పిచ్చిచేష్టలు విమర్శలకు కారణమవుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడుతున్నప్పుడు, పాట్ కమిన్స్ ఎల్‌బిగా అవుటైనట్టు బంగ్లాదేశ్ బౌలర్ మెహెదీ హసన్ అప్పీల్ చేశాడు. దానిని అంపైర్ నిగెల్ లాంగ్ తోసిపుచ్చడంతో, బంగ్లాదేశ్ డిఆర్‌ఎస్ ద్వారా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. థర్డ్ అంపైర్ నుంచి సమాచారం అందుకున్న అంపైర్ లాంగ్ తన నిర్ణయాన్ని మార్చుకొని, కమిన్స్ ఔటైనట్టు ప్రకటించాడు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు నాసిర్ హొస్సేన్ అంపైర్ పక్కనే నిలబడి, అతనిని అనుకరించాడు. ఈ చేష్టలు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచి ఉండవచ్చేమోగానీ, క్రికెట్ అభిమానులు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. అంపైర్‌ను కించ పరిచే విధంగా ఉన్న అతని పిచ్చి చేష్టలకు తగిన శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఐసిసి నిబంధనల్లో అనుకరణకు శిక్ష ఉందో లేదో చూడాలి.