ఆటాపోటీ

సూపర్ సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా సుచిన్ తెండూల్కర్ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఆసీస్‌తో 71 వనే్డలు ఆడిన అతను 3,077 పరుగులు చేశాడు. రికీ పాంటింగ్ 2,164 పరుగులతో రెండో స్థానాన్ని ఆక్రమించగా, ఆడం గిల్‌క్రిస్ట్ 1,622 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుత సిరీస్‌లో ఆడుతున్న రోహిత్ శర్మ 1,297, మహేంద్ర సింగ్ ధోనీ 1,255, కెప్టెన్ విరాట్ కోహ్లీ 1,002 చొప్పున పరుగులు సాధించారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల వనే్డ మ్యాచ్‌ల్లో ఎక్కువ శతకాలు, అర్ధ శతకాలు సాధించిన రికార్డు సచిన్ తెండూల్కర్ పేరిటే ఉంది. సచిన్ మొత్తం తొమ్మిది సెంచరీలు సాధించాడు. రికీ పాంటింగ్ ఆరు శతకాలతో రెండో స్థానంలో ఉంటే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెరి ఐదు సెంచరీలు చేసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. హాఫ్ సెంచరీల విషయానికి వస్తే, సచిన్ 24, పాంటింగ్ 15 చొప్పున సాధించారు. మాథ్యూ హేడెన్, ఆడం గిల్‌క్రిస్ట్ చెరి 13 అర్ధ శతకాలు బాదారు. విరాట్ కోహ్లీ తొమ్మిది హాఫ్ సెంచరీలతో, డేవిడ్ బూన్, ఆండ్రూ సైమండ్స్ సరసన నిలిచాడు.

- సత్య