ఆటాపోటీ

సాహసమంటే ఇదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే ముందు ఏ కెప్టెనైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించగలమన్న పూర్తి నమ్మకం కుదిరిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాడు. ఈ విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జార్జి మాన్‌ను సాహసవంతుడిగా పేర్కోవాలి. 1949లో న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. మొదటి రోజు ఆటలోనే చెలరేగిపోయింది. చివరి సెషన్ పూర్తి కావడానికి మరో 15 ఓవర్లు మిగిలి ఉండగా, 9 వికెట్లకు 313 పరుగుల స్కోరువద్ద జార్జి మాన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటి రోజు ఆట పూర్తికాక ముందే ఇన్నింగ్స్‌ను ఒక కెప్టెన్ డిక్లేర్ చేయడం అదే మొదటిసారి. అప్పట్లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ విధంగా తొలి రోజు ఆట పూర్తికాక ముందే డిక్లేర్ చేయడానికి వీల్లేదు. కౌంటీ మ్యాచ్‌ల్లో అందుకు వీలుంటుందిగానీ అంతర్జాతీయ క్రికెట్‌లో నిషిద్ధం. ఆ విషయం తెలిసి కూడా డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించిన జార్జి మాన్ ఆ తర్వాత అధికారులకు, అభిమానులకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం చోటుచేసుకున్న మార్పుల్లో మొదటి రోజు డిక్లేర్ చేయకూడదన్న నిబంధనను ఎత్తివేశారు. కాగా, జార్జి మాన్ తర్వాత ఇప్పటివరకూ మరో ముగ్గురు మాత్రమే ఈ విధంగా మొదటి రోజు ఆట ముగియడానికి ముందే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. 1974లో లార్డ్స్‌లోనే ఇంగ్లాండ్‌తో టెస్టు ఆడుతున్నప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ ఇంతికాబ్ ఆలం ఇదేవిధంగా 9 వికెట్లకు 130 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేశాడు. 2013లో హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ 9 వికెట్లకు 237 పరుగుల స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా గత నెల అడెలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు ఆడుతున్నప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ మొదటి రోజు ఆట ముగియడానికి ముందే, 9 వికెట్లకు 259 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసి, సాహసవంతులైన కెప్టెన్ల జాబితాలో చేరాడు.