ఆటాపోటీ

అలవాటులో పొరపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌కు ఒక అలవాటు సమస్యలు తెచ్చిపెడుతున్నది. క్రికెట్ ప్రపంచంలో సమర్థుడైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న అతను తీరిక దొరికినప్పుడల్లా గోల్ఫ్ ఆడేవాడు. ఖాళీగా ఉంటే, గోల్ఫ్ బంతిని స్టిక్‌తో కొడుతున్నట్టు ఊహిస్తూ, పొజిషన్ తీసుకునేవాడు. గాల్లోనే చేతులు ఊపేవాడు. ఈ అలవాటు కారణంగానే గెనీవాలో విమానాశ్రయ అధికారుల దృష్టిలో పడ్డాడు. అనుమానంతో నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు కొంత సేపు అతనిని సెల్‌లో ఉంచి, ఆతర్వాత హెచ్చరించి విడిచిపెట్టారు. లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయంలోనూ పీటర్సన్‌కు దాదాపు అలాంటి అనుభవమే ఎదురైంది. లండన్‌లో పోలీసులు అరెస్టు చేయకపోయినా, మరోసారి దొరికితే ఊచలు లెక్కించక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా అతను గాల్లో చేతులతో గోల్ఫ్ ఆడడాన్ని మానుకుంటాడో లేదో చూడాలి.

సత్య