ఆటాపోటీ

దారులు వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ బ్యాట్స్‌మన్ షర్జీల్ ఖాన్‌పై ఐదేళ్ల నిషేధాన్ని విధించడం పాక్ క్రికెట్‌లో చర్చకు కారణమైంది. ఈ అంశంపై అటు షర్జీల్, ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం విశేషం. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు షర్జీల్ ఖాన్‌పై ఆరోపణలున్నాయి. ముగ్గురు సభ్యులతో కూడిన అవినీతి నిరోధక ట్రిబ్యునల్ విచారణ జరిపి, షర్జీల్‌ను దోషిగా తేల్చింది. అతనిని ఐదేళ్లపాటు జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, తాను నిర్దోషినని పేర్కొంటున్న షర్జీల్ తనపై విధించిన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ స్వతంత్ర నిర్ణేతకు పిటిషన్ దాఖలు చేశాడు. తనను నిషేధించడం అన్యాయమని అందులో పేర్కొన్నాడు. అంతేగాక, తనను సస్పెండ్ చేసే అధికారం ట్రిబ్యునల్‌కు లేదని స్పష్టం చేశాడు. ఇలావుంటే, పిసిబి కూడా ట్రిబ్యునల్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, షర్జీల్‌కు వ్యతిరేకంగా పిసిబి పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. అతను క్రికెట్‌ను దారుణంగా వంచించాడని పిసిబి వ్యాఖ్యానించింది. ఫిక్సింగ్‌ను తీవ్రంగా పరిగణించాలని, షర్జీల్‌ను మరింత కఠినంగా శిక్షించకపోతే, ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తప్పుడు సాంకేతాలు వెళతాయని పిసిబి తన పిటిషన్‌లో పేర్కొంది. షర్జీల్‌పై శిక్ష మరింత కఠినంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రెండు వర్గాలు వేర్వేరు కోణాల్లో విభేదిస్తూ, అడ్యుడికేటర్ ముందు పిటిషన్లు దాఖలు చేయడం విచిత్రం.
ఖలీద్‌కు బెదిరింపు కాల్స్!
పిఎస్‌ఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు రుజువైన మరో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్‌కు బెదరింపు కాల్స్ వస్తున్నట్టు సమాచారం. అతని తరఫు లాయర్ బాదర్ ఆలం ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు. ఖలీద్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారని చెప్పాడు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఖలీద్‌కు భద్రత కల్పించాలని కోరాడు.