ఆటాపోటీ

గంగూలీ తలకు గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి లండన్‌లో భయంకరమైన అనుభవం ఎదురైంది. నవ్‌జోత్ సింగ్ సిద్ధుతో కలిసి ట్రైన్‌లో వెళుతున్నప్పుడు, కూపేలో కొంతమంది యువకులు బీరు తాగుతున్నారు. గంగూలీ, సిద్ధు వారిని చూడనట్టే నటించారు. కానీ, తాగిన మైకంలో ఉన్న ఓ యువకుడు బీర్ క్యాన్‌ను గంగూలీకి గురి చూసి విసిరాడు. అప్పటివరకూ ఓపిక పట్టిన సిద్ధు ఒక్కసారిగా ఆ యువకుడిపై లంఘించాడు. దీనితో గంగూలీ కూడా రంగంలోకి దిగక తప్పలేదు. పరస్పరం ముష్ఠిఘాతాలు కురిపించుకుంటున్న సమయంలో, స్టేషన్ వచ్చింది. అదే సమయంలో బీర్ క్యాన్ విసిరిన యువకుడు తుపాకీ తీసి గంగూలీ తలకు గురిపెట్టాడు. చావు ఖాయమనుకున్న అతనిని ఓ మహిళ కాపాడింది. ఎత్తుగా, బలంగా ఉన్న ఆమె తుపాకీ పట్టుకున్న యువకుడ్ని గట్టిగా పట్టుకొని ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకెళ్లింది. పోలీసులు రావడం, అతనిని నిర్బంధించడం జరిగిపోయాయి. బతుకుజీవుడా అనుకుంటూ గంగూలీ, సిద్ధు అక్కడి నుంచి బయటపడ్డారు.