ఆటాపోటీ

ఎసిబిలో ముసలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి)లో ముసలం పుట్టింది. స్కాట్‌లాండ్‌తో కలిసి ఇటీవలే టెస్టు హోదా సంపాదించామన్న ఆనందం కూడా ఎవరికీ దక్కనీయకుండా ఎసిబిలో అధికారుల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతున్నది. అఫ్గాన్ జాతీయ కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ తన పదవికి రాజీనామా ఇవ్వడం వెనుక ఎసిబి అధికారుల హస్తం ఉందన్నది వాస్తవం. చైర్మన్ అతిఫ్ మషాల్, చీఫ్ ఎగ్గిక్యూటివ్ షషీకుద్దీన్ తదితరులు ఒక వర్గంగా ఏర్పడి, ఎసిబిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులతో రాజీనామా చేయిస్తున్నారన్నది వాస్తవం. టెస్టు హోదాను సంపాదించినందుకు ఎసిబి అధికారులు ఆనందించకపోగా, పరస్పర విమర్శలు, ఘర్షణలతో దేశ క్రికెట్ పరువు తీస్తున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో.. టెస్టు క్రికెట్‌పై ఎసిబి ఎలాంటి ముద్ర వేస్తుందో? - సత్య