ఆటాపోటీ

పెడధోరణులపై గుగ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి కాలంలో యుద్ధ భూములను తలపిస్తున్న క్రికెట్ మైదానాలు ఇకపై అసలు సిసలైన క్రీడా వేదికలుగా దర్శనం ఇవ్వనున్నాయి. క్రికెట్‌లో చోటుచేసుకుంటున్న పెడధోరణులపై కొత్త నిబంధనల ‘గుగ్లీ’ విసిరిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమూల మార్పులకు తెరతీసింది. వీటిని పకడ్బందిగా అమలు జరిపితే 3‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ తన ఉనికిని కాపాడుకుంటుంది. భావి తరాలకు అత్యవసరమైన క్రీడాస్ఫూర్తిని అందిస్తుంది. డిఆర్‌ఎస్ అమలు వంటి ఎన్నో నిబంధనలను చెత్తబుట్టలో వేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి, తమకు తిరుగులేదని అనుకుంటూ నిబంధనలను పట్టించుకోని చాలామంది స్టార్ క్రికెటర్లకు కొత్తగా చోటుచేసుకున్న మార్పులు తప్పనిసరిగా పాఠాలను నేర్పుతాయ.

శతాబ్దాల చరిత్రగల 3జంటిల్మన్ గేమ్2 క్రికెట్ కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఇటీవల ఆమోదించిన నిర్ణయాలు ఈ క్రీడను సరికొత్త హంగులతో అలంకరించి అభిమానుల ముందుకు తెచ్చింది. భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ను మినహాయిస్తే, ప్రస్తుతం జరుగుతున్న అన్ని సిరీస్‌లకూ తాజాగా సవరించిన ఐసిసి నిబంధనావళి వర్తిస్తుంది. ఇకపై ఫార్మాట్ ఏదైనా, ఈ కొత్త నిబంధనలకు లోబడే మ్యాచ్‌లు జరుగుతాయి. ఫుట్‌బాల్, రగ్బీ వంటి క్రీడల్లో అమల్లో ఉన్న కొన్ని నిబంధనలను క్రికెట్‌లోనూ ప్రవేశ పెట్టాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. అయితే, సంప్రదాయాలను గౌరవిస్తామని, నిబంధనలను మార్చే ప్రసక్తే లేదని వాదిస్తూ, ఐసిసి మొండివైఖరిని కొనసాగించింది. వనే్డ ఇంటర్నేషనల్స్ చేరికతో క్రికెట్ స్వరూపం మారిపోయినా ఐసిసి అధికారులు పట్టించుకోలేదు. టి-20 మ్యాచ్‌లు రంగ ప్రవేశం చేసిన తర్వాత వచ్చిన పెను మార్పుల సునామీకీ స్పందించలేదు. కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తెరపైకి వచ్చిన దశాబ్ద కాలంలో క్రికెట్‌లో పోటీతత్వం పెరిగింది. హోరాహోరీ పోరాటాలు సామాన్యమయ్యాయి. అఫ్గానిస్తాన్, స్కాట్‌లాండ్ వంటి సాదాసీదా జట్లు కూడా టెస్టు హోదాను సంపాదించే స్థాయికి ఎదిగాయంటే, ప్రమాణాలు ఎంతగా పెరిగాయో ఊహించుకోవచ్చు. క్రికెట్ మైదానాలు యుద్ధ్భూములను తలపిస్తున్న నేపథ్యంలో, ఘర్షణలు, అవాంఛిత సంఘటనలు చోటుచేసుకోవడం సామాన్యమైంది. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, క్రమశిక్షణా రాహిత్యం దాదాపు అన్ని జట్లలోనూ కనిపిస్తున్నది. ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లకు మాత్రమే పరిమితమైన స్లెడ్జింగ్2 ఇప్పుడు అన్ని జట్లకూ వ్యాపించింది. ప్రత్యర్థి బౌలర్లు లేదా బ్యాట్స్‌మెన్‌ను హేళన చేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా కొనసాగే 3స్లెడ్జింగ్2 క్రికెట్‌ను వేరుపురుగులా తొలిచేస్తున్నది. 3జంటిల్మన్ గేమ్2 రానురాను జెయింట్స్ గేమ్‌గా మారుతున్నది. విలువలు పతనం కావడాన్ని ఉపేక్షిస్తే భవిష్యత్తులో క్రికెట్ మైదానాలు బాక్సింగ్ రింగ్స్‌గానూ, రెజ్లింగ్ మాట్స్‌గానో మారడం ఖాయమన్న విషయం ఎట్టకేలకు ఐసిసి పెద్దలకు బోధపడింది. క్రికెట్ ప్రతిష్ఠ మరింత దిగజారకుండా జాగ్రత్తపడే క్రమంలోనే కొత్త నిబంధనలకు ఆమోద ముద్ర వేశారు. రూల్స్ మారిన మరుక్షణం నుంచే క్రికెట్ స్వరూపం ఒక్కసారిగా మారిపోతుందనిగానీ, అతి ధోరణలకు తెరపడుతుందనిగానీ ఊహించడానికి వీల్లేదు. అయితే, ఎంతోకొంత మార్పు రావడం మాత్రం ఖాయం.
ఐసిసి కొత్తగా మార్చిన నిబంధనల్లో ఆటగాళ్లను కార్డ్ చూపి హెచ్చరించడం లేదా మైదానం బయటకు పంపడం ప్రధానమైనది. ఫుట్‌బాల్, రగ్బీ వంటి క్రీడల్లో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ఆటగాళ్లకు హెచ్చరికగా రిఫరీ ఎల్లో కార్డు చూపుతాడు. వాటి స్థాయిని బట్టి, మొదటి మూడు దశల్లో ఆటగాళ్లు నేరాలకు పాల్పడితే, ఐసిసి నిబంధనల ప్రకారం వారిపై అంపైర్లు చర్యలు తీసుకోవచ్చు. అయితే, లెవల్ ఫోర్ నేరానికి పాల్పడిన ఆటగాడిని రిఫరీ రెడ్ కార్డు చూపి బయటకు పంపించవచ్చు. నేరం తీవ్రతను బట్టి ఆ ఒక్క మ్యాచ్ నుంచిగానీ, మొత్తం సిరీస్ నుంచిగానీ ఆటగాళ్లను నిషేధించవచ్చు. అంపైర్‌పై దాడి చేయడం లేదా దాడి చేస్తామని బెదిరించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడం, ప్రత్యర్థి జట్టుకు చెందిన ఆటగాళ్లు లేదా వ్యక్తులపై చేయిచేసుకోవడం వంటి అంశాలను లెవల్ ఫోర్ నేరాల కిందకు చేర్చారు. ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఆటగాడు రెడ్ కార్డ్ కారణంగా మైదానం బయటకు వెళితే, అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని ఇవ్వరు. అంటే, ఒక ఆటగాడు వెళితే, పది మందితోనే సదరు జట్టు మ్యాచ్‌ని కొనసాగించాల్సి ఉంటుంది. క్రికెట్‌లోనూ కార్డులు, సస్పెన్షన్ పద్ధతులను అమలు చేయడం వల్ల స్లెడ్జింగ్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఆటగాళ్లు వెకిలి చేష్టలు, పరస్పర దూషణలు, ఘర్షణలు, అంపైర్ల నిర్ణయాలపై నిరసనలు, వాగ్వాదాలు గణనీయంగా తగ్గుతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తోపాటు, యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్‌పైనా ఐసిసి దృష్టి సారించింది. 2013లో జరిగిన ఆరో ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడంతో వెలుగులోకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ కేసుతో రాజుకున్న చిచ్చు ఇప్పటికీ ఆరలేదు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)లో భారీ మార్పులకు ఇది కారణమైంది. ముకుల్ ముద్గల్, లోధా కమిటీ దర్యాప్తు జరిపిన తర్వాత ఈ కేసులో అనేకానేక కొత్త కోణాలు వెలుగుచూశాయి. దీనికి సంబంధించిన పలు కేసులను విచారించిన తర్వాత, భారత క్రికెట్ ప్రక్షాళనకు లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాల్సిందేనని బిసిసిఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేగాక, బోర్డు నిబంధనావళిని మార్చాలని తేల్చిచెప్పింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తంమీద భారత క్రికెట్‌లో పెనుమార్పులకు కారణమైన స్పాట్ ఫిక్సింగ్‌కు తెరదించేందుకు ఐసిసి నడుం బిగించింది. అందుకే నోబాల్స్ నిబంధనల్లో భారీ మార్పులే చేసింది. బుకీల డిమాండ్ ప్రకారం నోబాల్స్ వేయడం, ఫలానా బంతిని నోబాల్‌గా విసురుతానని వివిధ సంకేతాల ద్వారా ముందుగానే వారికి తెలియచేయడం వంటి చర్యలకు తెరదించే దిశగా ఐసిసి కొన్ని నిబంధనలను మార్చింది. అంపైర్‌కు ఏమాత్రం అనుమానం వచ్చినా సదరు బౌలర్‌పై చర్యకు ఇప్పుడు ఆస్కారం ఉంది. మొత్తం మీద స్లెడ్జింగ్, ఫిక్సింగ్‌ను అరికట్టడానికి ఐసిసి అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఉపయోగపడతాయి.
పనిలో పనిగా, క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి వీలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని నిబంధనలను సవరించారు. మరికొన్నింటిని కొత్తగా నిబంధనావళిలో చేర్చారు. గతంలో మాదిరి ఇప్పుడు బ్యాట్స్‌మెన్ తమకు నచ్చిన సైజు, బరువు ఉన్న బ్యాట్లను ఉపయోగించడానికి వీల్లేదు. బ్యాట్ వెడల్పు 40 మిల్లీ మీటర్లు, మందం 67 మిల్లీ మీటర్లకు మించకూడదు. బ్యాట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సరి చూసేందుకు వీలుగా అంపైర్లకు పరికరాలను కూడా అందచేస్తారు. అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే డిఆర్‌ఎస్‌ను టెస్టు, వనే్డల్లోనేగాక, ఇకముందు టి-20 ఇంటర్నేషనల్స్‌లోనూ అమలు చేయాలని ఐసిసి నిర్ణయించింది. ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండు పర్యాయాలు డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేసే వీలుంటుంది. రనౌట్ నిబంధనను కూడా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండేలా ఐసిసి మార్చింది. ఇప్పటివరకూ ఉన్న నిబంధన ప్రకారం బంతి స్టంప్స్‌కు తగిలి, బెయిల్స్ గాల్లోకి ఎగిరే సమయానికి బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి రావాలి. కనీసం బ్యాట్‌నైనా క్రీజ్‌లో ఉంచాలి. ఒకవేళ ఆ సమయానికి ఆ బ్యాట్స్‌మన్ క్రీజ్ వెలుపల ఉండి, బ్యాట్ క్రీజ్‌లోకి వెళ్లినా అది గాల్లో ఉంటే అవుటైనట్టే పరిగణించేవారు. కానీ, ఇకపై బ్యాట్ గాల్లో ఉందా లేక నేలపై ఆనిందా అనే విషయంతో సంబంధం లేకుండా, క్రీజ్‌లోకి బ్యాట్ చేరితే నాటౌట్‌గా ప్రకటిస్తారు. బౌండరీ లైన్‌వద్ద కాపుకాసే ఫీల్డర్ బంతి గాల్లో ఉండగానే దానిని అడ్డుకోవడానికి, వీలైతే క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఒక్కోసారి అతను బౌండరీ లైన్ దాటేస్తుంటాడు. ఇంతవరకూ ఉన్న నిబంధనల ప్రకారం బంతి గాల్లో ఉన్నంతసేపు, ఫీల్డర్ బౌండరీ లైన్ దాటినా నష్టం లేదు. కానీ, సవరించిన నిబంధనల ప్రకారం ఫీల్డర్ బౌండీలైన్ దాటితే, అతను బంతిని ఆపినా దానిని బౌండరీగానే లెక్కిస్తారు. క్యాచ్ పట్టినా పరిగణలోకి తీసుకోరు. ఒకవేళ బంతి ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగిలిన తర్వాత దానిని ఒడిసిపట్టుకుంటే ఇప్పటివరకూ నాటౌట్‌గానే ప్రకటించేవారు. ఇకపై హెల్మెట్‌కు తగిలిన తర్వాత క్యాచ్ పట్టినా అది ఔటే. అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే డిఆర్‌ఎస్‌ను ఇకపై టి-20 ఇంటర్నేషనల్స్‌కు కూడా వర్తింప చేస్తారు. అన్ని జట్లూ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటూ, క్రికెట్‌లో ఇన్నాళ్లూ కనిపిస్తున్న వికృత చేష్టలపై ఐసిసి గుగ్లీ విసిరింది. దీనిని సమర్థంగా ఎదుర్కోవడం, క్లీన్ బౌల్డ్ కాకుండా తమను తాము కాపాడుకోవడం అటు జట్లకు, ఇటు ఆటగాళ్లకు సాధ్యం కాదన్నది వాస్తవం. ఈ మార్పులతోనైనా క్రికెట్ కొత్త రూపాన్ని సంతరించుకొని, సరికొత్త అందాలతో మన కళ్ల ముందు సాక్షాత్కరించనుంది.

- బిట్రగుంట