ఆటాపోటీ

మాయ రోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మకస్తుడు కదా అని బాధ్యతను అప్పచెప్తే, నిర్మాణాల నుంచి టికెట్ల వరకూ ఎక్కడబడితే అక్కడ, అందినకాడికి దోచుకున్న ఓ అధికారి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రియో ఒలింపిక్ కమిటీ చైర్మన్ కార్లొస్ నుజ్మన్‌ను బ్రెజిల్ అధికారులు అరెస్టు చేశారు. గత ఏడాది రియో డిజెనీరోలో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఆ సమయంలో చేపట్టిన వివిధ నిర్మాణాల్లో అనేక అవతవకలు చోటుచేసుకున్నాయని, నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయ. నుజ్మన్ స్వయంగా అవినీతిని ప్రోత్సహించాడని, మనీ లాండరింగ్‌ను కూడా జోరుగా జరిపాడని ఆరోపణలు వినిపించాయి. టికెట్ల అమ్మకాల్లోనూ గోల్‌మాల్ జరిగిందని కొంతమంది క్రీడాభిమానులు కోర్టులను ఆశ్రయించారు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత బ్రెజిల్ ఒలింపిక్ సంఘం (బిఒఎ)తోపాటు ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. నుజ్మన్ నేరాలకు పాల్పడినట్టు ప్రాథమికంగా రుజువు కావడంతో పోలీస్ అధికారులు అతనిని అరెస్టు చేశారు. సమాచారం తెలిసిన వెంటనే అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ అతనిపై నిషేధం విధించింది. తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే వరకూ అతను ఏ స్థాయిలోనూ ఫుట్‌బాల్ వ్యవహారాల్లో, ఎలాంటి హోదాలోనూ ఉండరాదని స్పష్టం చేసింది. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది.