ఆటాపోటీ

స్టంపింగ్స్ సెంచరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత మంది టెస్టు క్రికెటర్లుగా ముద్ర పడతారు. మరికొందరు పరిమిత ఓవర్ల ఫార్మాట్లకే పరిమితమవుతుంది. అటు టెస్టు, ఇటు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరచడం అరుదు. అందులోనూ పరస్పర విరుద్ధమైన టెస్టులు, వనే్డల్లో సమానంగా నెగ్గుకురావడం ఓపెనర్‌కు దాదాపు అసాధ్యం. కానీ, భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్‌ను ఇందుకు మినహాయించాలి. టెస్టుగానీ.. వనే్డగానీ.. అతను ఓకే విధంగా ఆడతాడు. అందుకే టెస్టుల్లో 8,207, వనే్డల్లో 7,518 పరుగులు సాధించాడు. టెస్టు, వనే్డల్లో 7,500 పరుగుల మైలురాళ్లను దాటిన ఏకైక ఓపెనర్ ఇప్పటివరకూ అతనే.