ఆటాపోటీ

ఆల్‌రౌండ్ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా ఆటగాడు బ్యాటింగ్‌లో రాణిస్తాడు లేదా బౌలింగ్‌లో చెలరేగుతాడు. డెరెక్ రాండల్, గస్ లోగీ, ఏక్‌నాథ్ సోల్కర్, జాంటీ రోడ్స్ వంటి వారు తమ అసాధారణ ఫీల్డింగ్ నైపుణ్యంతో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ప్రతిభ కనబరచే ఆటగాళ్లను ఆల్‌రౌండర్లుగా పేర్కొంటాం. కానీ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వెలిగిపోయిన వారు చాలా అరుదు. అలాంటి అరుదైన క్రికెటర్ రవీంద్ర జడేజా ఎన్నటికీ చెరిగిపోని మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2016 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకాలు సాధించాడు. అంతేగాక, పది వికెట్లు పడగొట్టాడు. నాలుగు క్యాచ్‌లు కూడా పట్టాడు. క్రికెట్ చరిత్రలోనే ఈ విధంగా ఒకే టెస్టులో రెండు హాఫ్ సెంచరీలు చేసి, పది వికెట్లు కూల్చడంతోపాటు నాలుగు క్యాచ్‌లు కూడా పట్టిన తొలి ఆల్‌రౌండర్‌గా అతను రికార్డుకెక్కాడు.