ఆటాపోటీ

ఫుట్‌బాలర్ ధోనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జట్టు మాజీ కెప్టెన్, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకడిగా ఇప్పటికే గుర్తింపు సంపాదించాడు. అయితే, సమయం దొరికిన ప్రతిసారీ తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌లోనూ అతను తన ప్రతిభాపాటవాలను కనబరుస్తూనే ఉన్నాడు. ప్రజాహిత కార్యక్రమాలకోసం నిధులు సేకరించడానికి విరాట్ కోహ్లీ నాయకత్వం వహించిన ఆల్ హార్ట్స్, బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ నేతృత్వంలోని ఆల్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన చారిటీ మ్యాచ్‌లో ధోనీ అద్భుత ప్రతిభ కనబరిచాడు. తనకు లభించిన ఫ్రీకిక్‌లో ధోనీ కొట్టిన ఇంగ్లాండ్ మాజీ సూపర్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ షాట్ మాదిరిగానే సుడులు తిరుగుతూ గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది. మరో అద్భుతమైన ఫీల్డ్ గోల్ కూడా చేసిన అతను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ధోనీ ప్రతిభతో అల్ హార్ట్స్ జట్టు 7-3 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఒక గోల్ చేయడం విశేషం.