ఆటాపోటీ

ఏది నిజం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్ట్రేలియా యువ టెన్నిస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ప్రేగ్‌లో జరిగిన లావెర్ కప్ టోర్నమెంట్‌లో మ్యాచ్ ఆరంభానికి ముందు అతను మోకాళ్లపై కూర్చోవడం వివాదానికి కారణమైంది. అంతకుముందు అమెరికా రగ్బీ క్రీడాకారులు అదే తరహాలో నిరసన వ్యక్తం చేయడంతో, వారికి మద్దతుగా కిర్గియోస్ ఆ విధంగా చేశాడని సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, తన ఎదుగుదలకు ఎంతో శ్రమించిన తాత, నాయనమ్మ మృతి చెందారని, వారికి గుర్తుచేసుకుంటూ, ప్రతి మ్యాచ్‌కి ముందు తాను ఈ విధంగానే మోకాలిపై కూర్చొని ప్రార్థన చేస్తానని కిర్గియోస్ వివరణ ఇచ్చాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశాడంటూ ఆరోపించిన రగ్బీ ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారని, వారితో తనకు సంబంధం ఏమిటని కిర్గియోస్ ప్రశ్నిస్తున్నాడు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అతనిపై విమర్శలు ఆడగడం లేదు. ఇంతకీ ఆరోపణలు, వివరణల్లో ఏది నిజం అన్న ప్రశ్నకు సమాధానం లేదు.