ఆటాపోటీ

పిసిబికి కొత్త సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి సమస్యలు కొత్తకాదు. ఉగ్రవాదుల నుంచి పొంచివున్న ముప్పు మొదలుకొని క్రికెటర్ల అనైక్యత వరకూ అడుగడుగునా పిసిబి సమస్యల వలయంలో చిక్కుకొని అల్లాడుతునే ఉంది. ఇప్పుడు తాజాగా తమ దేశంలో తయారైన ‘కూకబురా’ బంతుల కారణంగా కొత్త సమస్య తలెత్తింది. స్వదేశంలో తయారైన బంతులను వాడితే ఖర్చు తగ్గుతుంది. పైగా అత్యంత విలువైన విదేశీ మారకాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఈ బంతుల నాణ్యత విషయంలో విమర్శలు చెలరేగడంతో ఏం చేయాలో అర్థంగాక, చివరికి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని పిసిబి నిర్ణయించింది. దేశవాళీ పోటీల నుంచి అంతర్జాతీయ సిరీస్‌లు, టోర్నీల వరకూ అన్ని స్థాయిల్లోనూ స్వదేశీ ‘కూకబురా’ బంతుల స్థానంలో ఇకపై విదేశీ ‘కూకబురా’ బంతులు దర్శనం ఇవ్వనున్నాయి. స్థానికంగా తయారైన బంతుల కంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంతులు ఖరీదైనవి. వాటిని తెప్పించుకోవడానికి అవసరమైన విదేశీ మారకం కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి కూడా పొందాలి. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, క్రికెటర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి బంతులను దిగుమతి చేసుకోవడానికి కార్యవర్గం మొగ్గు చూపినట్టు పిసిబి అంటున్నది. అయితే, దీని వల్ల భారీగా నష్టపోతామని లోలోపల బాధపడుతోంది.