ఆటాపోటీ

ప్రత్యర్థులకు సింహస్వప్నం భువీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్పీడ్ స్టార్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ రోజురోజుకూ రాటుదేలుతున్నది. పదునెక్కుతున్న అతని బంతులను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వనే్డలో రాణించిన తీరే అతని ప్రతిభకు నిదర్శనం. ఓపెనర్లు హామిల్టన్ కార్ట్‌రైట్, డేవిడ్ వార్నర్‌ను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపిన భువీ చివరిలో కేన్ రిచర్డ్‌సన్‌ను కూడా అవుట్ చేసి సత్తా చాటాడు. మొత్తం మీద 6.1 ఓవర్లు బౌల్ చేసిన అతను కేవలం తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కెరీర్ ఆరంభంలో పిచ్, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే అతను బంతిని స్వింగ్ చేయగలిగేవాడు. కానీ, అనుభవం పెరుగుతున్నకొద్దీ అతను పిచ్ తీరుతోగానీ, గాలీ దిశతోగానీ ఏ విధమైన సంబంధం లేకుండా బంతిని స్వింగ్ చేయగలుగుతున్నాడు. అంతేగాక బంతుల్లో వేగంకూడా పెరిగింది. క్రమం తప్పకుండా గంటకు సగటున 140 కిలోమీటర్ల వేగాన్ని అతను అందుకోగలుగుతున్నాడు. కండిషనింగ్ కోచ్ శంకర్ బసు ఇచ్చిన ప్రత్యేక శిక్షణవల్లే తనకు స్వింగ్, పేస్ సాధ్యమవుతున్నాయని భువీ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ బసు ఇచ్చిన శిక్షణ తనను దృఢంగా మార్చిందని వ్యాఖ్యానించాడు.
మెరుపు వేగంతో బంతులు వేయడంలోనేకాదు.. బ్యాట్స్‌మెన్ బలాలను బలహీనతలను అధ్యయనం చేసి, వారు విజృంభించకుండా కట్టడి చేయడంలోనూ భువనేశ్వర్ ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఒక సమర్థుడైన బౌలర్‌కు ఉండాల్సిన లక్షణం కూడా ఇదే. క్రీజ్‌లో నిలదొక్కుకుంటే, పరుగుల వరద పారించే ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్‌ను అవుట్ చేయడం వెనుక భువీ చేసిన హోం వర్క్ కీలకపాత్ర పోషించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున వార్నర్‌తో భువీ ఆడుతున్నాడు. అందుకే, అతను ఎలాంటి బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడో భువీకి తెలుసు. వార్నర్‌తోపాటు, మిగతా అందరి బ్యాటింగ్ తీరునూ తాను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తానని భువీ తన ఇంటర్వ్యూలో తెలిపాడు. అందులో నిజం ఉందని, అనుక్షణం మెరుగైన బౌలింగ్‌కు శ్రమిస్తాడు కాబట్టే ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నాడని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ వంటి ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ కాలం బెంచ్‌కే పరిమితమవుతుండగా, భువీ మాత్రం టీమిండియాలో స్థిరంగా కొనసాగుతున్నాడు.