ఆటాపోటీ

ఓఅంపైర్ దొంగతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాకు చెందిన మాజీ అంపైర్ డారెల్ హేర్ దొంగతనం చేసి దొరికిపోయాడు. తాను పొరపాటు చేశానని, దీనిని మొదటి తప్పుగా భావించి క్షమించాలని కోర్టును కోరాడు. 1995 సీజన్‌లో శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఆరోపించడంతోపాటు, పదేపదే నోబాల్స్ ప్రకటించి వివాదానికి కారణమైన హేర్ 1992-2008 మధ్యకాలంలో 78 టెస్టుల్లో అంపైర్‌గా వ్యవహరించాడు. ఐసిసి ప్యానెల్ అంపైర్‌గా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం హేర్‌కు అలవాటుగా మారింది. గ్యాంబ్లింగ్‌కు అలవాటు పడిన అతను ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 28 మధ్యకాలంలో తాను పని చేస్తున్న మద్యం దుకాణం నుంచి 7,041 డాలర్లు దొంగిలించాడు. ఈ వ్యవహారం సిసిటీవీ ఫుటేజీల్లో రికార్డు కావడంతో గుట్టురట్టయింది. కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు హేర్ తాను దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. తనను క్షమించాలని న్యాయమూర్తిని కోరాడు. కాగా, 18 నెలలు అతను సత్‌ప్రవర్తన కలిగి ఉండాలని కోర్టు ఆదేశించింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది.