ఆటాపోటీ

నిర్లక్ష్యమా? ఉద్దేశపూర్వకమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండర్-17 సాకర్ వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న భారత ఫుట్‌బాల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పొరపాటు చేశారో లేక ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారో తెలియదుగానీ వారి నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత్‌కు వివిధ స్థాయిల్లో ఆడిన జట్లకు గతంలో నాయకత్వం వహించిన వారిని అండర్-17 సాకర్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించారు. పికె బెనర్జీ, సయ్యద్ నరుూముద్దీన్, మగన్ సింగ్ రజ్వీ తదితరుల పేర్లను ప్రకటించిన అధికారులు మాజీ గోల్‌కీపర్ భాస్కర్ గంగూలీని మరిచారు. అందరి పేర్లు ఒకేసారి పిలవడంతో, వేదిక వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భాస్కర్ పేరు జాబితాలో ఉన్నప్పటికీ, దానిని చదవకపోవడంతో అతను ప్రధాని నుంచి జ్ఞాపికను తీసుకోవడానికి వెళ్లలేదు. ప్రధాని వెళ్లిన తర్వాత జరిగిన పొరపాటును గ్రహించిన భారత ఫుట్‌బాల్ అధికారులు భాస్కర్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. అయితే, ప్రధాని నుంచి జ్ఞాపికను తీసుకునే ఒక అరుదైన అవకాశాన్ని పొగొట్టారంటూ అధికారులపై భాస్కర్ సన్నిహితులు మండిపడుతున్నారు. నిజమే కదా!