ఆటాపోటీ

ఇక అండర్-20 వరల్డ్ కప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌ను సమర్థంగా నిర్వహిస్తున్న భారత్ భవిష్యత్తులో అండర్-20 వరల్డ్ కప్ పోటీలు నిర్వహించే అవకాశం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం చిలీలో అండర్-17 వరల్డ్ కప్ జరిగినప్పుడు సుమారు నాలుగు లక్ష్లల మంది ఆ టోర్నమెంట్‌ను వీక్షించారు. అయితే, భారత్‌లోని ఆరు వేరువేరు కేంద్రాల్లో జరిగిన 36 గ్రూప్ స్థాయి మ్యాచ్‌లను సుమారు ఎనిమిది లక్షల మంది చూసినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అంటే, ఒక్కో మ్యాచ్‌కి సుమారు 23,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇక భారత్ పాల్గొన్న మ్యాచ్‌ల విషయానికి వస్తే, సగటు హాజరీ 49,000గా నమోదైంది. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతున్నదనడానికి ఇదో నిదర్శనం. పైగా, చాలా కేంద్రాల్లో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. స్టేడియాల నిర్వాహణ తీరు కూడా మెరుగుపడింది. అంతర్జాతీయ స్థాయి టోర్నీలను నిర్వహించడం భారత్‌కు అసాధ్యమని ఒకప్పుడు ముద్ర వేసిన దేశాలే ఇప్పుడు అండర్-17 వరల్డ్ కప్ కోసం చేసిన ఏర్పాట్లు, కల్పించిన సౌకర్యాలు, లభిస్తున్న ఆదరణను చూసి ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లను నిర్వహించగలిగే సదుపాయాలు, అన్ని రకాల వసతులు భారత్‌లో ఉన్నాయని ప్రశంసిస్తున్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ కూడా భారత ఫుట్‌బాల్ సంఘాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నది. ఔట్ ఫీల్డ్‌లో పచ్చిక నుంచి స్టేడియంల వద్ద భద్రత వరకూ అన్ని అంశాల్లోనూ అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ అనుభవంతో అండర్-20 వరల్డ్ కప్‌ను నిర్వహించడం వారికి ఏమాత్రం కష్టం కాదు. కార్పొరేట్ సంస్థలు కూడా స్టేడియాల మరమ్మతుకు, సరికొత్త నిర్మాణాలకు ముందుకు రావడం శుభసూచకం. అండర్-20 వరల్డ్ కప్ లేదా అదే స్థాయి అంతర్జాతీయ టోర్నీలను నిర్వహించేందుకు బిడ్స్ వేసి, సమర్థంగా దానిని సాధించే సమస్త అవకాశాలు, సదుపాయాలు భారత్‌కు ఉన్నాయి. 2019లో అండర్-20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ పోటీలను నిర్వహించేందుకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) ఇప్పటికే లాంఛన ప్రాయంగా బిడ్ వేసింది. అండర్-17 వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, భారత ఫుట్‌బాల్ అధికారులంతా రాబోయే కాలంలో మెగా టోర్నీలను దక్కించునే ప్రయత్నంలో పడ్డారు. ఐ-లీగ్ రాకతో మారిన భారత ఫుట్‌బాల్ ముఖచిత్రం అండర్-17 వరల్డ్ కప్‌తో మరింత శోభను సంతరించుకుంది. అండర్-20 వరల్డ్ కప్‌ను నిర్వహించే అవకాశం దక్కితే, సమీప భవిష్యత్తులోనే సాకర్ హబ్‌గా భారత్ ఎదగడం ఖాయం.