ఆటాపోటీ

రాజీనామా తప్పలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిఫా అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని రోజుల్లోనే బ్లాటర్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. గత ఏడాది మే 29న జరిగిన 65వ ఫిఫా మహాసభలో బ్లాటర్‌కు 133 ఓట్లు లభించాయి. అతనితో పోటీపడిన ప్రిన్స్ అల్ బిన్ అల్ హుస్సేన్‌కు 73 ఓట్లే వచ్చాయి. అయితే, జూన్ రెండో తేదీన హడావుడిగా విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన బ్లాటర్ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ హఠాత్ నిర్ణయాన్ని ఎవరూ ఊహించలేదు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ, కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకూ తాను పదవిలో కొనసాగుతానని బ్లాటర్ ప్రకటించాడు. కానీ, ప్లాటినీకి భారీ మొత్తంలో సొమ్మును ఫిఫా ఖాతా నుంచి అక్రమంగా చెల్లించాడన్న ఆరోపణలపై గత ఏడాది అక్టోబర్ 8న బ్లాటర్‌ను సస్పెండ్ చేశారు. డబ్బునిచ్చిన బ్లాటర్‌తోపాటు ఆ మొత్తాన్ని తీసుకున్న ప్లాటినీపైనా ఎనిమిదేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. వీరిద్దరు తమపై విధించిన సస్పెన్షన్‌ను ఫిఫా అప్పీల్స్ కమిటీలో సవాలు చేశారు. మొత్తం మీద బ్లాటర్ రాజీనామా తర్వాత, అధ్యక్ష స్థానానికి రేసులో ఉన్న అభ్యర్థుల జాబితా నుంచి హాట్ పేవరిట్‌గా ముద్ర వేయించుకున్న ప్లాటినీ ఎవరూ ఊహించని రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది.
అమాయకుడేమీ కాదు..
ఒక అద్దె భవనంలో, అరకొర సిబ్బందితో నడుస్తున్న ఫిఫాకు కొత్త ఊపిరిపోసి, ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఉన్న క్రీడా సంస్థగా తీర్చిదిద్దిన బ్లాటర్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఫిఫాకు అతను చేసిన సేవలు ప్రశంసనీయం. కానీ, అధికారం కోసం దేనికైనా తెగిస్తాడన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ప్లాటినీకి జరిపిన చెల్లింపుల ఉదంతమే ఇందుకు ఉదాహరణగా పేర్కోవచ్చు. ప్లాటినీతో ఒక పనికి సంబంధించిన కాంట్రాక్టు 1999 ఆగస్టులో కుదిరిందని బ్లాటర్ వాదన. ఆ పనిని ప్లాటినీ 2002లో పూర్తి చేశాడని అతను అంటున్నాడు. ఆ పనికి సంబంధించిన చెల్లింపులనే 2011లో జరిపినట్టు అతను వివరిస్తున్నాయి. అయితే, ప్లాటినీతో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన రికార్డులేవీ లేవని బ్లాటర్ అనడం అనుమానాలకు తావిస్తోంది. అప్ప చెప్పిన పనిని గురించిన వివరాలు ఇవ్వలేకపోయాడు. ఆ ప్రాజెక్టును ప్లాటినీ పూర్తి చేసినట్టు రుజువు చేసే ఆధారాలను కూడా అందించలేకపోయాడు. దీనితో వీరిద్దరూ పరస్పర ప్రయోజనాలను కలిగించే రీతిలో భారీ మొత్తాన్ని దుర్వినియోగం చేశారన్న ట్రిబ్యునల్ వాదనే నెగ్గింది. ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు పడింది. నిధులను సొంత ప్రయోజనాలకు వాడుకున్న వీరిని ఎనిదేళ్ల పాటు సస్పెండ్ చేయడంతోపాటు భారీ జరిమానాను కూడా ట్రిబ్యునల్ విధించింది. బ్లాటర్‌కు 50,000 డాలర్లు, ప్లాటినీకి 80,000 డాలర్లు చొప్పున జరిమానా విధించింది. ఈ నిర్ణయాలపై అప్పీల్స్ కమిటీని ఆశ్రయించిన బ్లాటర్, ప్లాటనీలకు సస్పెన్షన్ ఎనిమిదేళ్ల నుంచి ఆరేళ్లకు తగ్గడంతో ఊరట లభించిందేగానీ, సమస్యకు తెరపడలేదు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తికావడంతో, వీరిద్దరి ఆధిపత్యానికి దాదాపు తెరపడిందనే అనుకోవాలి. ఒకవేళ అప్పీల్స్ కమిటీ వీరిని నిర్దోషులుగా ప్రకటించి, సస్పెన్షన్‌ను ఎత్తివేసినా కొత్త అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయిన తర్వాతగానీ వారికి ఫిఫాలో కాలుపెట్టే అవకాశం దక్కదు. అప్పటి వరకూ ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో!