ఆటాపోటీ

మారథాన్ గేమ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెస్‌లో అత్యంత సుదీర్ఘమైన గేమ్ 1989లో జరిగింది. బెల్‌గ్రేడ్‌లో నికొలిక్, ఆర్సొవిక్ మధ్య జరిగిన ఆ పోటీ 269 ఎత్తుల వరకూ కొనసాగి, చివరికి డ్రాగా ముగిసింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ చెస్ చరిత్రలో ఇదే అతి సుదీర్ఘమైన గేమ్. కాగా, ఒక గేమ్‌ను 5,949 ఎత్తుల వరకూ కొనసాగించవచ్చని నిపుణులు అంటున్నారు. అన్ని ఎత్తులు ఆడాలంటే, ఎన్ని రోజులు లేదా నెలలు చెస్ బోర్డు ముందు కూర్చోవాలో?
టైమ్ మింగేశారు..
బొబొట్సొర్, ఇర్కొవిన్ మధ్య 1966లో ఒక గేమ్ జరిగింది. మిగతా వాటి మాదిరిగానే అదీ ఒకటి అనుకుంటే పొరపాటే. ఆ గేమ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇద్దరూ ఒక్క ఎత్తు కూడా వేయకుండా ఏకంగా 46 నిమిషాలు గడిపేశారు. చెస్ గేమ్స్‌ను అధికారికంగా రికార్డు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్క ఎత్తు కూడా వేయకుండా ఆటగాళ్లు గడిపిన ఎక్కువ సమయం ఇదే. అంతసేపు వాళ్లు ఏం ఆలోచించారో ఎవరికైనా అర్థమైందో లేదో!