ఆటాపోటీ

లెక్క కష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు విన్న పజిల్ చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. చెస్ బోర్డులోని మొదటి చదరంపై ఒకటి, రెండో చదరంపై రెండు, మూడో చదరంపై దానికి రెట్టింపు నాలుగు, నాలుగో చదరంపై ఎనిమిది.. ఈ విధంగా బియ్యం గింజలను పేర్చుకుంటూ వెళితే, 64వ చదరం పూర్తయ్యే సరికి ఎన్ని గింజలు ఉంచాలి? సమాధానం అతికొద్ది మందికే తెలిసి ఉంటుంది. ఆ మొత్తం 93,23,37,20,36,85,47,75,808 గింజలు.
* మొదటి ఎత్తులో తప్పనిసరిగా ఒక పావును ముందుకు కదిలించాలి. ఒకప్పుడు పాన్‌ను కేవలం ఒక గడి మాత్రమే కదిలించేవారు. 1280 తర్వాత మొదటి ఎత్తులో ఆటగాళ్ల ఇష్టాన్నిబట్టి ఒకటి లేదా రెండు గడులు జరపవచ్చనే విధానం అమల్లోకి వచ్చింది. ఇది మొదట స్పెయిన్‌లో ఆరంభంకాగా, ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. ఫిడే నిబంధనల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు.
* 3క్యాజిలింగ్2 విధానం 1561లో అమల్లోకి వచ్చింది. మధ్యలో ఇతర పావులు లేనప్పుడు, రూక్ (ఎనుగు)ను రాజు (కింగ్)ను ఆయా స్థానాల నుంచి ఒకేసారి కదిలించడాన్ని క్యాజిలింగ్ అంటారు. ఇక ‘చెక్‌మేట్’ అనే పదం పర్షియా పదం ‘షా మత్’ నుంచి వచ్చింది. ‘రాజు మృతి చెందాడు’ అని ఆ పదానికి అర్థం. షా మత్ నుంచి ‘చెక్‌మేట్’ పదం ఆవిర్భవించింది.

ఎన్ని రకాలో!

ఇద్దరు ఆటగాళ్లు చెరొక ఎత్తు వేయడానికి కనీసం నాలుగు వందల విధానాలు ఉన్నాయని అమెరికా చెస్ సమాఖ్య అధ్యయనం స్పష్టం చేసింది. రెండో ఎత్తు వేయడానికి 72,084 మార్గాలున్నాయని నిరూపించింది. మూడో ఎత్తు ముగియడానికి తొంభై లక్షల రీతుల్లో పావులను కదపవచ్చు. ఈ రకంగా పెంచుకుంటూపోతే, సుమారు 50 ఎత్తుల్లో ఒక గేమ్‌లో ఫలితం తేలితే లేదా డ్రాగా ముగిస్తే, ఎన్ని రకాలుగా బలగాలను ముందుకు కదపవచ్చనేది ఊహకు కూడా అందదు.
* మడతపెట్టడానికి వీలుగా ఉండే చెస్ బోర్డును ఒక మత ప్రచారకుడు కనిపెట్టాడు. అప్పట్లో మత ప్రచారకులు చెస్ ఆడడం నిషిద్ధం. ఈ ఆట అంటే ఎంతో మక్కువ ఉన్న ఆ మత ప్రచారకుడు మడతపెట్టే రీతిలో చెస్ బోర్డును తయారు చేసి, దానిని తన పుస్తకాల అల్మారాలో ఉంచేవాడట.
* చెస్ ఆడడం ఆషామాషీ కాదు. ఎటు చూసినా ఎనిమిది చొప్పున, నలుచదరంగా మొత్తం 64 గళ్లు ఉండే చెస్ బోర్డే ఒక యుద్ధ మైదానం. రాజును రక్షించడానికి పద, గజ, తురగ దళాలతోపాటు, బలమైన మంత్రి కూడా ఉండడం చెస్‌కు పూర్తి యుద్ధ రూపాన్నిస్తుంది. నిపుణల అంచనా ప్రకారం చెస్‌లో మొదటి నాలుగు ఎత్తులను సుమారు 31,000 కోట్ల రకాలుగా వేయవచ్చు. మన ఊహకు అందకపోయినా, శాస్ర్తియ అధ్యాయనాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

ఈజిప్టు, గ్రీస్ వంటి దేశాల్లో ఒకప్పుడు పావులకు బదులు, ఆయా బలగాల వేషధారణలో మనుషులను చదరంగం గళ్లపై నిలబెట్టేవారు. గేమ్‌లో పావులు చనిపోయనట్టుగానే గళ్లలో ఉన్న మనుషులు కూడా చనిపోవాల్సిందే. ఈ వికృతమైన ఆటను రాచకుటుంబీకులు ఎంతో ఆసక్తిగా చూసేవారు. వారికి అదొక వినోదం. ఆ రోజుల్లో మల్లయుద్ధం, ముష్ఠి యుద్ధం, కర్రసాము, కత్తి యుద్ధం వంటి అనేకానేక క్రీడల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. అప్పట్లో బానిస వ్యవస్థ బలంగా ఉండేది కాబట్టి, చెస్‌లో వారినే పావులుగా నిలబెటేట్టేవారు. రాజులు, రాజ ప్రతినిధులు, వారి బంధుగణం తమ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి మనుషులతో ఆడే చెస్‌నే ఎంచుకునేవారు. ఎన్నో ఉద్యమాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా బానిస వ్యవస్థకు తెరపడింది. మనుషులను పావులుగా నిలబెట్టి, కత్తులతో పొడిచి చంపే దుష్ట సంప్రదాయం ముగిసింది. ఒకప్పుడు ఈ విధంగా మనుషులతో చెస్ ఆడించేవారని చెప్పడానికి నేలపై తీర్చిదిద్దిన భారీ చెస్ బోర్డులు ఇప్పటికీ చాలా కోటల్లో కనిపిస్తాయ. అప్పటి సంప్రదాయాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయ. చదరంగాన్ని కూడా రాక్షస క్రీడగా మార్చడం విచిత్రం. వినోదం పేరుతో మనుషులను హతమార్చడం ఆటవికం. కానీ అప్పట్లో అదే ఒక సంప్రదాయం.. శక్తిసామర్థ్యాలకు ఒక ప్రామాణికం.