ఆటాపోటీ

వెటరన్ల సమరోత్సాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెస్ లేదా చదరంగం ఎప్పుడు, ఎక్కడ మొదలైందో చెప్పడం కష్టం. అయితే భారతదేశంలో 9వ శతాబ్దంలో గుప్తుల సామ్రాజ్యం కొనసాగుతున్న కాలంలో చెస్ ఆడేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి. అయితే, కాలక్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకోగా, ఫిడే ఆవిర్భావం తర్వాత ఏకీకృత నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు మొదట్లో క్వీన్ కదలిక కేవలం ఏదైనా ఒక మూలకు, ఒక అడుగుకు మాత్రమే పరిమితమయ్యేది. ఆ తర్వాత రెండు గడులను దాటవచ్చనే నిబంధనను అనుసరించారు. కొన్నాళ్ల తర్వాత గడుల పరిమితిని ఎత్తివేశారు. క్రమేణ ముందుకు, వెనక్కు లేదా పక్కలకు నేరుగా వెళ్లేందుకు అవకాశం కల్పించారు. కానీ, అది కేవలం రెండు గడులకు మించి జరగకూడదనే విధానం అమల్లో ఉండేది. తర్వాతి కాలంలో రూక్, మిషప్ మూవ్స్‌ను కలిపి క్వీన్‌గా మార్చేశారు.

ఒక సమస్యపై వేగంగా స్పందించడానికి, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడానికి, పటిష్టమైన వ్యూహరచన చేయడానికి మనిషి మెదడుకు పదునుపెట్టుకోవాలి. చురుకుదనాన్ని పెంచుకోవడానికి ధ్యానంనుంచి ప్రహేళికలను పూర్తి చేయడం వరకూ ఎన్నో మార్గాలున్నాయి. అయితే, మానసిక నిపుణులు అన్నిటికంటే చెస్ ఆడడమే అత్యుత్తమ మార్గమని అంటారు. ఒకప్పుడు రాజులు యుద్ధ మైదానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకోవడం నుంచి బలగాలను ఎటునుంచి ఎటువైపు మళ్లించాలి, ఎక్కడ మోహరింప చేయాలి, ఎప్పుడు దాడికి ఉపక్రమించాలి అనే అంశాల వరకూ అన్నింటిలోనూ, గడుగడుగునా చదరంగం ఎత్తులనే ప్రామాణికంగా తీసుకునే వారు. ఒక రకంగా చెప్పాలంటే, 64 గళ్లతో కూడిన చెస్ బోర్డే ఒక యుద్ధ మైదానం. అన్ని చతురంగ బలగాలు ఉందుబాటులో ఉంటాయి. ఎవరు సమర్థంగా, వ్యూహాత్మకంగా పావులను కదుపుతారో వారినే విజయలక్ష్మి వరిస్తుంది. ఇప్పటికీ, వివిధ సమస్యల పరిష్కారినికి చెస్ ఆడడాన్ని మించిన మార్గం మరొకటి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మహా కష్టం బ్లైండ్‌ఫోల్డ్..

కళ్లు ఎంత పెద్దవి చేసుకొని చూస్తున్నా, ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరగడం, గేమ్ చేజారడం ఖాయం. ప్రత్యర్థి ఎత్తుగడలను అర్థం చేసుకోవాలంటే, చెస్ బోర్డును అనుక్షణం గమనిస్తునే ఉండాలి. పావుల కదలికలను అధ్యయనం చేయాలి. రెప్పార్చకుండా బోర్డును, పావులను, వాటి కదలికలను గమనించడమే చాలా కష్టం. ఇక కళ్లకు గంతలు కట్టుకొని, మనసులోనే చెస్ బోర్డును ఊహించి గేమ్ ఆడడం సామాన్యులకు అసాధ్యం. అయితే, గంతలు కట్టుకొని చెస్ ఆడేవారు కూడా ఉన్నారు. 3బ్లైండ్‌ఫోల్డ్‌గా పిలిచే ఈ గేమ్‌లో ఒకరి కళ్లకు గంతలు ఉంటాయి. మధ్యవర్తి సాయంతో ప్రత్యర్థి ఎత్తుల గురించి అతను తెలుకుంటాడు. తన పావులను కదుపుతాడు. ఆరంభంలో కొంతవరకూ చెస్ బోర్డును మనసులో ముద్రించుకోగలిగినా, ఎత్తులు కొనసాగుతున్న కొద్దీ బ్లైండ్‌ఫోల్డ్ ఆడేవారు గందరగోళంలో పడతారు. ఒకరితో బ్లైండ్‌ఫోల్డ్ ఆడడమే కష్టమంటే, హంగరీకి చెందిన జానస్ ఫ్లెచ్ 1960లో ఒకేసారి 52 మందితో కళ్లకు గంతలు కట్టుకొని గేమ్స్ ఆడాడు. 31 విజయాలను సాధించాడు. అతని రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.

చదరంగం ఆడడానికి వయసుతో పని లేదని అంటారు. టీనేజ్‌లోనే ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ హోదాలను సంపాదించిన చిచ్చర పిడులు ఎంతో మంది ఉన్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (్ఫడే) ఆధ్వర్యంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ వయసుతో నిమిత్తం లేకుండా జరుగుతుంది. అయితే, సీనియర్లను దృష్టిలో ఉంచుకొని, పురుషులు, మహిళల విభాగాల్లో ప్రత్యేక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను కూడా ఫిడే నిర్వహిస్తున్నది. ఈసారి ఈ సీనియర్ల పోరు సోమవారం (నవంబర్ 6) నుంచి మొదలవుతుంది. 1991లో మొదలైన ఈ టోర్నమెంట్ పురుషుల విభాగంలో పోటీపడాలంటే కనీసం 60 సంవత్సరాలు, మహిళల విభాగంలో కనీసం 50 సంవత్సరాలు నిండాలి. 2014 నుంచి నిబంధనలు మారాయి. ఇప్పుడు పురుషులతోపాటు మహిళలకు కూడా ప్లస్ 50, ప్లస్ 65 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. స్విస్ విధానంలో 11 రౌండ్ల టోర్నమెంట్‌గా ఇది కొనసాగుతుంది. ఫిడే సభ్య సంఘాలు ఎంతమందినైనా బరిలోకి దించవచ్చు. ఫిడేకు చెందిన నాలుగు వేర్వేరు జోన్ల నుంచి పదికంటే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు హాజరైతే, వారికోసం ప్రత్యేకంగా పోటీలు జరుగుతాయి. రెండు విభాగాల్లోనూ గెలిచిన వారికి అంతకు ముందే గ్రాండ్ మాస్టర్ హోదా లేకపోతే, ట్రోఫీతోపాటు ఆ హోదాను కూడా ప్రకటిస్తారు. పోటీదారుల్లో ఇద్దరు సమాన పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచిన సంఘటన మొదటి 17 పోటీల్లో చోటు చేసుకోలేదు. అయితే, 18వ సీనియర్ ప్రపంచ కప్‌లో ఈ సమస్య తలెత్తడంతో, ఫిడే మరోసారి నిబంధనలను సవరించింది. సమానంగా పాయింట్లు సంపాదించిన ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించింది. 1991లో ఈ పోటీలు మొదలుకాగా, పురుషుల విభాగంలో వాసిలీ స్మిస్లోవ్ (రష్యా), మహిళల విభాగంలో ఇవా లాడానినెకరాకస్ (హంగరీ) విజేతలుగా నిలిచారు. అప్పటి నుంచి ఇంత వరకూ 26 సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ చెస్ పోటీలు జరిగాయి. 27వ చాంపియన్‌షిప్ ఇటలీలోని అక్వి టెర్మిలో ఈనెల 6 నుంచి 19 వరకు జరుగుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించిన వారిలో ఎక్కువ మంది సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఆసక్తి ప్రదర్శించరు. అయితే, ఫిడే ప్రపంచ చాంపియన్‌షిప్‌ను, ఆతర్వాత సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న ఘనతను వాసిలి స్మిస్లోవ్ సాధించాడు. తొలి సీనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచే సమయానికి అతని వయసు 70 సంవత్సరాలు. ఇంత వరకూ ఉన్న విజేతల్లో అత్యధిక వయసు విషయంలో విక్టర్ కొర్చ్‌నొయ్ పేరిట రికార్డు ఉంది. 2006లో అతను తన 75వ ఏట ఈ టైటిల్ సాధించాడు. అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ అతను సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌కు హాజరుకాలేదు. ఆ పోటీల్లో అతను మొదటి నాలుగు గేమ్స్‌లో విజయాలు నమోదు చేశాడు. ఐదో రౌండ్‌లో గేమ్‌ను డ్రాతో ముగించాడు. ఆతర్వాత వరుసగా మూడు గేమ్స్‌లో విజయభేరి మోగించాడు. తొమ్మిదో రౌండ్‌లోకి అడుగుపెట్టే సమయానికి అతను తన సమీప ప్రత్యర్థి కంటే ఒక పాయింట్ ముందున్నాడు. అందుకే, వ్యూహాత్మకంగా ఆడిన అతను చివరి మూడు గేమ్స్‌ను డ్రా చేసుకొని టైటిల్ అందుకున్నాడు.
ఆస్ట్రియాలో జరిగిన ఎనిమిదో ప్రపంచ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో వ్లాదిమిర్ బాగిరొవ్ (లాత్వియా), ఊల్ఫ్‌గాంగ్ ఉల్మాన్ (జర్మనీ) చెరి 8.5 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారు. ఆ టోర్నీ ఆరంభంలో ఆధిపత్యాన్ని కనబరచిన ఉల్మాన్ టైటిల్ కోసం జరిగిన టై బ్రేకర్‌లో పరాజయాన్ని ఎదుర్కోగా, బాగిరొవ్ విజేతగా నిలిచాడు. ప్రపంచ చాంపియన్లు మార్క్ తైమనోవ్, బొరిస్లావ్ ఇవ్‌కోవ్‌సహా మొత్తం 10 మందికి ఎనిమిది పాయింట్లు సంపాదించారు. మహిళల విభాగంలో 24 మంది పోటీపడితే, జార్జియాకు చెందిన మహిళా గ్రాండ్ మాస్టర్ తమార్ ఖమైదాష్విలీ టైటిల్ సాధించింది. 2003లో జర్మనీ కేంద్రంగా జరిగిన ప్రపంచ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో 272 మంది పోటీపడ్డారు. ఫిడే ఆధ్వర్యంలో జరిగే ఒక టోర్నీకి ఇంత మంది పోటీదారులు బరిలోకి నిలవడం అదే మొదటిసారి. ముగ్గురు ఆటగాళ్లు, యురీ షబనోవ్ (రష్యా), గ్రాండ్ మాస్టర్ జనీస్ క్లొవాన్స్ (లాత్వియా), అంతర్జాతీయ మాస్టర్ వ్లాదిమీర్ బుకాల్ (క్రొయేషియా) తలా తొమ్మిది పాయింట్లు సంపాదించడంతో టై బ్రేకర్ అనివార్యమైంది. ఆ పోరులో మిగతా ఇద్దరిపై విజయం సాధించిన యురీ షబనోవ్ విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో 22 మాత్రమే పోటీకి దిగారు. జార్జియా క్రీడాకారిణి తమార్ ఖమైదాషిలీ మరోసారి టైటిల్‌ను దక్కించుకుంది. 14వ విడత పోటీలు హాలే (జర్మనీ)లో జరగ్గా పురుషుల విభాగంలో టైటిల్‌ను యురీ షబనోవ్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. మహిళల విభాగంలో ఎలెనా ఫతాలిబెకొవా సరికొత్త చాంపియన్‌గా వెలిసింది. మొత్తం మీద ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా కొనసాగే ఈ టోర్నమెంట్ మరోసారి చెస్ అభిమానులను ఆకట్టుకోవడానికి ముస్తాబైంది. జయాపజయాలతో సంబధం లేకుండా, ప్రతి గేమ్‌ను ఆస్వాదించడానికి చెస్ ప్రేమికులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా- రు.

శ్రీహరి