ఆటాపోటీ

ఫుట్‌బాల్‌కు పొంచివున్న విపత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిఫా కొత్త అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. తాజా ఎన్నికల్లో చివరి వరకూ అందరి కంటే ముందున్న షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫాను ఎన్నికల్లో అనూహ్యంగా ఓడించిన ఇన్ఫాంటినో మొత్తం 115 ఓట్లు సంపాదించాడు. ఇబ్రహీం అల్ ఖలీఫాకు 88 ఓట్లు లభించాయి. ఫ్రిన్స్ బిన్ అల్ హుస్సేన్‌కు నాలుగు ఓట్లు దక్కగా, జెరోమ్స్ చాంపేంజ్‌కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. మొత్తం 207 ఓట్లు పోలుకాగా, ఇన్ఫాంటినో తన సమీప ప్రత్యర్థి ఇబ్రహీం ఖలీఫాను 27 ఓట్లు తేడాతో ఓడించాడు. సభ్య దేశాలకు భారీ మొత్తాలను ఇస్తానని ప్రకటించడం, అత్యధిక బడ్జెట్‌తో ఫిఫాను తీర్చిదిద్దుతానని స్పష్టం చేయడం ఇన్ఫాంటినో విజయానికి ప్రధాన కారణాలు. అయితే, అతను ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఫిఫా దాదాపుగా దివాలా తీస్తుంది. మూడునాలుగు సంవత్సరాల్లో ఫిఫా బ్యాంకు బ్యాలెన్స్, ఆస్తులు కరిగిపోయినా ఆశ్చర్యం లేదు. హామీలు నెరవేరిస్తే ఒక సమస్య.. నెరవేర్చకుంటే మరో సమస్య. ఇన్ఫాంటినో ఎటు వైపు మొగ్గు చూపినా కష్టమే.

ఆరంభంలో ఎనిమిది సభ్య దేశాలు
ఫిఫా మొదట్లో ఐరోపా ఖండానికి చెందిన ఎనిమిది సభ్య దేశాల మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించడానికి ఏర్పాటైంది. క్రమంగా ప్రపంచమంతా విస్తరించి, ఇప్పుడు 209 సభ్య దేశాలతో బలమైన క్రీడా సంస్థగా ఎదిగింది. ఆరు కానె్ఫడరేషన్లను ఫిఫా గుర్తించింది. కేవలం మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కేటాయింపుపైనే ఫిఫా 1.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నది. అడిడాస్, కోకకోలా, గాజ్‌ప్రోమ్, హ్యుందయ్/కియా మోటర్స్, వీసా, బడ్‌వైజర్ కంపెనీలు ఫిఫాకు మెయిన్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. వీటిలో చాలా కంపెనీలు ఇప్పుడు స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఫిఫా అధ్యక్షులు వీరే

రాబర్ట్ గెరిన్ (ఫ్రాన్స్/ 1904 మే 22 నుంచి 1906 జూన్ 4 వరకు/ రెండు సంవత్సరాలు).
డానియల్ బర్లే ఊల్‌ఫాల్ (యునైటెడ్ కింగ్‌డమ్/ 1906 జూన్ 4 నుంచి 1918 అక్టోబర్ 24 వరకు/ 12 సంవత్సరాలు).
జూలెస్ రిమెట్ (ఫ్రాన్స్/ 1921 నుంచి 1954
వరకు/ 33 సంవత్సరాలు).
రుడాల్ఫ్ సీల్‌డ్రెయర్స్ (బెల్జియం/ 1954 నుంచి 1955 వరకు/ ఒక సంవత్సరం).
ఆర్థర్ డ్రెవ్రీ (యునైటెడ్ కింగ్‌డమ్/ 1955 నుంచి 1961 మార్చి 25 వరకు/ ఆరు సంవత్సరాలు).
స్టాన్లీ రోస్ (యునైటెడ్ కింగ్‌డమ్/ 1961 నుంచి 1974 మే 8 వరకు/ 13 సంవత్సరాలు).
జావో హవెలాంజ్ (బ్రెజిల్/ 1974 మే 8 నుంచి 1998 జూన్ 8 వరకు/ 24 సంవత్సరాలు).
సెప్ బ్లాటర్ (స్విట్జర్లాండ్/ 1998 జూన్ 8 నుంచి 2015 అక్టోబర్ 8 వరకు/ 17 సంవత్సరాలు).
ఇస్సా హెటౌ (కామెరూన్/ తాత్కాలిక అధ్యక్షుడు/ 2015 అక్టోబర్ 8 నుంచి 2016 ఫిబ్రవరి 26 వరకు).
గియానీ ఇన్ఫాటినో (26 ఫిబ్రవరి 2016 నుంచి).
అధ్యక్ష పదవికి పోటీ పడిన అభ్యర్థులు
ప్రిన్స్ అలీ బిన్ అల్ హుస్సేన్, సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా, జెరోమ్ చాంపేంజ్, టోక్యో సెక్స్‌వేల్, గియానీ ఇన్ఫాంటినో.

ఫుట్‌బాల్ క్రీడ సమస్యల ఊబిలో కూరుకుపోతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానులున్న సాకర్‌కు అదే స్థాయలో ఆదాయం కూడా ఉంది. ఆదాయాన్ని వెన్నంటే అవినీతి, అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయ. వీటి ఫలితంగానే ఫుట్‌బాల్‌కు కష్టాలు వచ్చిపడ్డాయ. దీనికి తోడు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ఆర్థికంగా నిలువునా మునిగిపోయే ప్రమాదంలో పడింది. ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా, కొత్త అధ్యక్షుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, నష్ట నివారణ చర్యలు చేపట్టకపోయినా, సమీప భవిష్యత్తులోనే భారీ విపత్తు తప్పదని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. సెప్ బ్లాటర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చులు ఫిఫాను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొత్త కార్యవర్గానికి ఫిఫా పగ్గాలు చేతికి అందాయన్న ఆనందాన్ని ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఆర్థిక పరిస్థితులు మింగేస్తున్నాయి. గత ఏడాది ఫిఫా వంద మిలియన్లకుపైగా లోటును ఎదుర్కొన్నట్టు చిట్టాపద్దులు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల తక్షణమే ఫిఫా కష్టాల ఊబిలో చిక్కుకొని అల్లాడుతుందనిగానీ, సమస్యల సుడిగుండంలో విలవిల్లాడుతుందనిగానీ అనుకోవడానికి వీల్లేదు. అయితే, బ్లాటర్ మాదిరిగానే కొత్త అధ్యక్షుడు కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవన్నది వాస్తవం. ప్రస్తుతం ఫిఫాకు వివిధ బ్యాంకుల్లో 1.5 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
అధ్యక్ష పదవికి పోటీ పడే సమయంలో మిగతా అభ్యర్థులు గుప్పిస్తున్న వరాలు, ఇస్తున్న హామీలపై ఆసియా ఫుట్‌బాల్ చీఫ్ షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. సభ్య దేశాలకు భారీ మొత్తాలను ఇస్తున్నట్టు మిగతా అభ్యర్థులంతా హామీ ఇవ్వడాన్ని కొత్త అధ్యక్షుడి రేలో అందరి కంటే ముందున్న ఖలీఫా వ్యతిరేకించాడు. ఆ హామీలన్నీ అమలు చేస్తే, 2018 సంవత్సరం నాటికి ఫిఫా దివాలా తీయడం ఖాయమని హెచ్చరించాడు. మరో అభ్యర్థి జెరోమ్ చాంపేంజ్ కూడా ఫిఫా ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాడు. త్వరలోనే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ ప్రమాదాన్ని నివారించడానికి సరైన దిశలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. గతంలో ఫిఫాకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన చాంపేంజ్‌కు సంస్థ ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది. గత ఏడాది 100 మిలియన్ డాలర్ల ఆర్థిక లోటుతోవున్న ఫిఫాను మరింత నష్టపోకుండా కాపాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సభ్య దేశాలకు అతను లేఖ కూడా రాశాడు. అయితే, మరో అభ్యర్థి గియానీ ఇన్ఫాంటినో సభ్య దేశాలపై హామీల వర్షం కురిపించాడు. ఆయా దేశాల్లో సాకర్ అభివృద్ధి కోసం ప్రతి నాలుగేళ్లకోసారి ఐదు మిలియన్ డాలర్ల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. అదే విధంగా ఆరు కాంటినెంటల్ సమాఖ్యలకు తలా 40 మిలియన్ డాలర్ల చొప్పున ఇస్తామని ప్రకటించాడు. అతనిచ్చిన హామీని నెరవేర్చాలంటే పిఫాపై మిలియన్ డాలర్ల అదనపు భాగం తప్పదు. అయితే, ఇన్ఫాంటినో మాత్రం కొత్త స్పాన్సర్లను వెత్తుక్కోవడం, సాకర్‌ను ఇంకా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం వంటి చర్యల ద్వారా లోటును భర్తీ చేసుకోవచ్చని వాదించాడు.
అధ్యక్ష పదవికి రేసులో ఉన్న మరో అభ్యర్థి ప్రిన్స్ అల్ బిన్ అల్ హుస్సేన్ కూడా ఇలాంటి హామీనే ఇచ్చాడు. సభ్య దేశాల్లో సాకర్‌ను అభివృద్ధి చేయడానికి కొంత మొత్తాన్ని ఖర్చు చేసి, తిరిగి ఆయా దేశాల నుంచే భారీగా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని అతని వాదన. అధ్యక్ష ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో అభ్యర్థి టోక్యో సెక్స్‌వెల్ సరళీకృత విధానాలను అమలు చేయాలంటూ కొత్త ప్రతిపాదన చేశాడు. ప్రతి సభ్య దేశంలోనూ జాతీయ జట్టుకు జెర్సీల నుంచి బూట్ల వరకూ అన్నింటికీ స్పాన్సర్‌షిప్స్‌ను సంపాదించాలన్నది అతని అభిప్రాయం. తాను సూచించిన విధానాలను అమలు చేస్తే 5.7 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని, 2018 నాటికి 338 మిలియన్ డాలర్ల మిగులు నిధులు ఉంటాయని అతని వాదన. మొత్తం మీద అభ్యర్థులు ఎవరికి తోచిన విధంగా వారు హామీలనిచ్చి, కొత్తకొత్త విధానాలను ప్రకటించి గందరగోళ పరిస్థితులకు కారణమయ్యారు. ఈ పరిస్థితి నుంచి ఫిఫాను కొత్త కార్యవర్గం ఏ విధంగా బయటపడేస్తుందో చూడాలి. గియానీ ఇన్ఫాంటినో మిగతా అంధరి కంటే ఎక్కువ హామీలు గుప్పించడమేగాక, భారీ మొత్తాలను అందించడం ద్వారా సాకర్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కోవడం సభ్య దేశాలను ఆకట్టుకుంది. అందుకే అతని నే అధ్యక్షుడిగా ఎన్నుకున్నాయ.
ఆశనిరాశల మధ్య
ఫిఫాలోని 209 సభ్య దేశాల్లో ఎక్కువ శాతం ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతున్నాయి. వీటిలో సుమారు 50 దేశాల్లో మాత్రమే సాకర్‌కు మంచి ఆదరణ ఉంది. ఆదాయం కూడా భారీగానే వస్తున్నది. కానీ, మిగతా దేశాల్లోని ఫుట్‌బాల్ సంఘాలు ఆర్థికంగా బలపడలేదు. సాకర్ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడానికి తగిన నిధులు కూడా వాటి వద్ద లేవు. ఈ పరిస్థితుల్లో, సుమారు 150 దేశాలకు తలా ఐదు మిలియన్ డాలర్ల చొప్పున చెల్లిస్తామని అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థుల్లో కొందరు హామీ ఇవ్వడం ఆయా ఫుట్‌బాల్ సంఘాల్లో కొత్త ఆశలకు కారణమైంది. కొత్త కార్యవర్గాన్ని ఇదే విషయంలో ఫిఫా సభ్య దేశాలు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే, ఫిఫా నిజంగానే హామీలు అమలు చేస్తుందా? తమ కల నెరవేరుతుందా? అన్న అనుమానాలు చాలా సభ్య దేశాలను వెంటాడుతున్నాయి.
కారణాలు అనేకం
ఫిఫా గత ఏడాది భారీ నష్టాన్ని, లోటును ఎదుర్కోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవినీతి ఆరోపణలు వాటిలో ప్రధానమైనవి. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించే హక్కులను ఇచ్చేందుకు భారీగా ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై పలువురు ఫిఫా అధికారులను అమెరికా నిఘా విభాగం సూచనలపై స్విట్జర్లాండ్ పోలీస్‌లు అరెస్టు చేసిన నేపథ్యంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫిఫా టాప్ స్పాన్సర్లు వెనక్కు తగ్గాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫిఫాకు స్పాన్సర్‌షిప్ కొనసాగిస్తే, తమతమ సంస్థలకు చెడ్డపేరు వస్తుందని అనుమానం వ్యక్తం చేశాయి. రష్యాలో జరిగే 2018 వరల్డ్ కప్ పోటీలకు స్పాన్సర్‌షిప్‌ను అందించరాదని టాప్ స్పాన్సర్లు తీసుకున్న నిర్ణయం ఫిఫాను దారుణంగా దెబ్బతీసింది. దీనికితోడు, ఫిఫా ఆధ్వర్యంలో జరిగే ఇతర టోర్నీలకు అండగా ఉన్న 27 కంపెనీల్లో 20 కంపెనీలు కూడా వెనుక్కు తగ్గాయి. అవినీతి ఆరోపణలు నిగ్గుతేలిన తర్వాతే స్పాన్సర్‌షిప్స్ గురించి ఆలోచించాలన్న నిర్ణయానికి వచ్చాయి. రష్యాలో జరిగే వరల్డ్ కప్ పోటీలకు స్పాన్సషిప్‌ను అందించేందుకు మేటి కంపెనీలు ఏవీముందుకు రాకపోవడంతో కనీసం 600 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఫిఫా కోల్పోయే ప్రమాదం ఉంది. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టిన అమెరికా నిఘా విభాగం సాక్ష్యాధారలతోసహా దోషులను పట్టించగలిగితే, ఈ ఆదాయంలో కోత మరింత పెరిగే అవకాశం ఉంది.

- బిట్రగుంట