ఆటాపోటీ
బీరు ప్రియుడు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 November 2017
సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఆస్ట్రేలియాలోనేగాక, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో ఎన్నో రికార్డులు అతని ఖాతాలో చేరాయి. అయితే, బీర్లు తాగడంలో డేవిడ్ బూన్ నెలకొల్పిన రికార్డును ఎవరూ ఛేదించలేకపోతున్నారు. 1980 దశంలో ఆసీస్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా సేవలు అందించిన బూన్‌కు బీర్లంటే ఎంతో ఇష్టం. 1989లో యాషెస్ సిరీస్‌కోసం ఇంగ్లాండ్ వెళుతున్న సమయంలో అతను ఏకంగా 52 క్యాన్ల బీరును తాగేశాడు. 1945లో రాడ్నీ మార్ష్ 45 క్యాన్లను లాగించాడు. తానేమీ తక్కువ కాదని బూన్ మరో ఏడు అధికంగానే తాగేశాడు. ఎంతైనా బీర్లును గుటకాయస్వాహ చేయడంలో ఆస్ట్రేలియన్లు మించినవారు ఎవరుంటారు?