ఆటాపోటీ

సమర్థుడు జార్డిన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 69 సిరీస్‌లు జరగ్గా, రెండు జట్లు చెరి 32 సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి. ఐదు సిరీస్‌లు డ్రా అయ్యాయి. సమవుజ్జీలుగా నిలుస్తున్న ఈ జట్లు తాజా యాషెస్‌లో హోరాహోరీగా పోరాడడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇలావుంటే, మ్యాచ్‌ల విషయానికి వస్తే, రెండు జట్లు 325 మ్యాచ్‌లు ఆడాయి. ఆస్ట్రేలియా 130, ఇంగ్లాండ్ 106 టెస్టులను గెల్చుకున్నాయి.
ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా విశిష్ట సేవలు అందించిన డగ్లస్ జార్డిన్ ‘బాడీలైన్’ కారణంగా పరువు పోగొట్టుకున్నాడేగానీ, నిజానికి అతను ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్. 1934లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు ‘బాడీలైన్’ అస్త్రాన్ని అతనిపైనే ప్రయోగించారు. అప్పట్లో వెస్టిండీస్ పేసర్లను ఎదుర్కోవడం అంటే ప్రాణాలకు తెగించడమే. అసలే మెరుపువేగంతో బంతులు వేసే విండీస్ పేసర్లు.. దానికితోడు ‘బాడీలైన్’ వ్యూహం.. ఇంకెవరైనా అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయలేక వికెట్లు సమర్పించుకునేవారేమో! కానీ, జార్డిన్ అందుకు పూర్త్భిన్నం. విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కెరీర్‌లోనే అత్యుత్తమంగా 127 పరుగులు సాధించి, తన ముందు విండీస్ కుప్పిగంతులు చెల్లవని నిరూపించాడు.